నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారు: చంద్రబాబు మరోసారి సంచలన కామెంట్స్
గతంలో తిరుమల వెళుతుంటే తనపై దాడి జరిగిందని అన్నారు.

Chandrababu Naidu: నాసిరకం నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఇవాళ ఆయన ఏపీలోని ఉండవల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 319 రూపాయలకు కిలో నెయ్యి టెండర్ కట్టబెట్టారని అన్నారు. రూ.319కి కిలో నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు. గతంలో తిరుమల వెళుతుంటే తనపై దాడి జరిగిందని, వేంకటేశ్వర స్వామే తనను కాపాడాడని చెప్పారు.
చంద్రబాబు కామెంట్స్
- తిరుమల లడ్డూ న్యాణ్యత, సువాసనలో ఎంతో విశిష్టత ఉంది
- స్వామి వారి మహత్స్య ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చేయాలనుకున్నా చేయలేకపోయారు
- అంతటి విశిష్టత ఉన్న లడ్డూ కి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారు
- నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారు
- ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్ లో పాల్గొనలేక పోయాయి.. అలాంటిది వైసీపీ వచ్చీరావడంతోనే ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసింది
- ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్ గా మార్చేశారు ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారు
- కొండపై వ్యాపారాలు చేశారు.అన్య మతస్తులను టీటీడీ చైర్మన్ గా వేశారు
- రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకున్నారు
- తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేలా కార్యక్రమాలు చేపట్టాం
- చేసిన తప్పుని సమర్ధించుకుంటే ప్రధానికి లేఖ రాయటానికి ఎంత ధైర్యం?
- ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు మీరు?
- నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోంది
- టీటీడీ చైర్మన్ గా చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుంది
- మరో మాజీ చైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశాడు
- ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మతసామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత
- నాకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నాకు కర్తవ్యం
అంతకు ముందు చంద్రబాబు నాయుడు అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని అన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని తెలిపారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించండని, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని తెలిపారు.
నేను జనసేనలోకి వెళ్తుండడంతో టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని