Special Entry Darshan: 3నెలల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రిలీజ్ డేట్ తెలిపిన టీటీడీ

తిరుమల శ్రీవారిని దర్శనార్థం టిక్కెట్లను మార్చి 21న రిలీజ్ చేయనుంది టీటీడీ. ఈ మేరకు చేసిన ప్రకటనలో రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Special Entry Darshan: 3నెలల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రిలీజ్ డేట్ తెలిపిన టీటీడీ

TTD

Updated On : March 18, 2022 / 5:01 PM IST

Special Entry Darshan: తిరుమల శ్రీవారిని దర్శనార్థం టిక్కెట్లను మార్చి 21న రిలీజ్ చేయనుంది టీటీడీ. ఈ మేరకు చేసిన ప్రకటనలో రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను మార్చి 21 నుంచి 3 రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ.

ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నార్థం సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు మంజూరు చేస్తారు.
Read Also : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌