తిరుమలలో భారీ వర్షాలతో టీటీడీ కీలక నిర్ణయం.. ఆ మార్గం మూసివేత..!

అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.

తిరుమలలో భారీ వర్షాలతో టీటీడీ కీలక నిర్ణయం.. ఆ మార్గం మూసివేత..!

Tirumala (Photo Credit : Google)

Updated On : October 16, 2024 / 5:59 PM IST

TTD Key Decision : తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో తిరుమల తడిసి ముద్దైంది. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (అక్టోబర్ 17) శ్రీవారి నడక మార్గాన్ని మూసివేయనున్నారు. ఇప్పటికే పాప వినాశనం, శ్రీవారి పాదాల మెట్టు మార్గాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు.

గత రెండు రోజులుగా తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానలతో ఘాట్ రోడ్ లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయ్యింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక డెసిషన్ తీసుకుంది. రేపటి రోజున శ్రీవారి మెట్టు నడకదారిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం వరకు ఆ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఆ మార్గాన్ని మూసివేస్తారు.

మళ్లీ వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు శ్రీవారి మెట్ల నడక మార్గాన్ని మూసివేసే పరిస్థితి ఉంది. తిరుమల, ఘాట్ రోడ్, నడకదారిలో వర్షం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో 2021లో భారీ వర్షాలు వచ్చినప్పుడు శ్రీవారి మెట్టు నడక మార్గం పెద్ద ఎత్తున దెబ్బతింది. పెద్ద పెద్ద బండరాళ్లు నడక మార్గంలోకి కొట్టుకువచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అలర్ట్ అయ్యింది.

తిరుమలకు నడక మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, మరొకటి శ్రీవారి మెట్టు నడక మార్గం. శ్రీవారి మెట్టు నడక మార్గం.. శ్రీనివాస మంగాపురం నుంచి మార్గం. దాన్ని రేపటి రోజున మూసివేస్తారు. అలిపిరి నుంచి వెళ్లే మెట్ల మార్గాన్ని యధావిధిగా తెరిచే ఉంటుంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో చాలా తక్కువ మంది మాత్రమే అటువైపు వెళ్తుంటారు. నడక దారి కాస్త దూరం తక్కువ అని ఆ మార్గాన్ని కొందరు మాత్రమే ఎంచుకుంటారు. తిరుపతి నుంచి 10 కిలోమీటర్లు వెహికల్ లో వెళ్లి అక్కడి నుంచి నడకదారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఆ మార్గంలో భక్తుల రద్దీ అంతగా ఉండదు. ప్రధానమైన అలిపిరి మెట్ల మార్గాన్ని మాత్రం యధావిధిగా తెరిచే ఉంచుతారు. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడితే వాటిని వెంటనే తొలగించడానికి జేసీబీలు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు అధికారులు.

 

Also Read : వాళ్లు చెబితేనే బాలినేని జనసేనలోకి వెళ్లారా? ఆ భయంతోనే వైసీపీని వీడారా?