Andhrapradesh : ఏపీలో విషాద ఘటన.. ప్రాణాలు తీసిన బీర్ బెట్టింగ్.. ఇద్దరు యువకులు మృతి..

Andhrapradesh : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీర్లు తాగే పోటీ పెట్టుకొని ఇద్దరు యువకులు మృతిచెందారు.

Andhrapradesh : ఏపీలో విషాద ఘటన.. ప్రాణాలు తీసిన బీర్ బెట్టింగ్.. ఇద్దరు యువకులు మృతి..

Two people died after drinking beer

Updated On : January 18, 2026 / 10:52 AM IST

Andhrapradesh : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీర్లు తాగే పోటీ పెట్టుకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం బండవడ్డీపల్లిలో చోటు చేసుకుంది.

Also Read : Euphoria: సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు.. నాపై కోపం కూడా వస్తుంది.. ప్రతీ ఒక్కరూ..!

ఆరుగురు యువకులు బీర్ బెట్టింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఎవరు బీర్లు తాగితే వారే విజేతలు అన్నట్లుగా పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆరుగురు యువకులు మొత్తం 19 బీర్లు తాగినట్లు సమాచారం. పోటీపడి బీర్లు తాగిన యువకుల్లో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మణికుమార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో అతన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో యువకుడు పుష్పరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కెవి పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణం వద్ద మృతుడి కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటుతున్నాయి.