Amaravati : మట్టి పెళ్లలు విరిగి పడి ఇద్దరు మృతి

నగరం నడిబొడ్డున జరుగుతున్న మల్టీ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని, జి+5 నిర్మాణం కోసం ప్లాన్ పెట్టుకున్నాట్లు గుంటూరు మేయర్ కావటి మనోహర్ 10tvకి తెలిపారు. కార్పొరేషన్ నుండి...

Amaravati : మట్టి పెళ్లలు విరిగి పడి ఇద్దరు మృతి

Amaravati

Updated On : March 16, 2022 / 1:42 PM IST

Two workers Died Amaravati: అమరావతిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం విరిగి పడడంతో మట్టి పెళ్ళలు కింద చిక్కుకుని ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. రాడ్ బెండింగ్ వర్క్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరుగుతుందని ముందే గ్రహించిన ఇద్దరు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారు బీహార్, బెంగాల్ కు చెందిన కూలీలుగా గుర్తించారు.

Read More : AP Assembly : జగన్ ఫైర్ కాదు..ప్లవర్.. టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు

నగరం నడిబొడ్డున జరుగుతున్న మల్టీ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని, జి+5 నిర్మాణం కోసం ప్లాన్ పెట్టుకున్నాట్లు గుంటూరు మేయర్ కావటి మనోహర్ 10tvకి తెలిపారు. కార్పొరేషన్ నుండి అధికారులు అనుమతులు ఇవ్వలేదని ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనిపై ఎంక్వయిరి వేసి బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చారు.