Amit Shah Tour In AP : ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు.  ఢిల్లీ  నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.

Amit Shah Tour In AP : ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన

Amit Shaw Tirupati Tour

Updated On : November 12, 2021 / 8:16 PM IST

Amit Shah Tour In AP :  కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు.  ఢిల్లీ  నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.

ఆదివారం ఉదయం నెల్లూరు లోని వెంకటచలం వెళతారు. అక్కడ స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గోంటారు. మధ్యాహ్ననికి తిరుపతి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలనుంచి 7 గంటల వరకు హోటల్ తాజ్ లో జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు అమిత్ షా అధ్యక్షత వహిస్తారు.

Also Read : Dummugudem Maoists Case : దుమ్ముగూడెం కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఎ

అనంతరం బయలు దేరి రాత్రికి తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలోనే బస చేసి సోమవారం ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం తర్వాత సోమవారం తిరిగి ఢిల్లీ బయలు దేరి వెళతారు.