Bhupathiraju Srinivasa Varma : హైందవ ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం- కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోలీసు అధికారులు పెడుతున్న ఆంక్షలు పనికి రాని హడావుడి లాంటిది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి చేస్తన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే.

Bhupathiraju Srinivasa Varma : భోగి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సంక్రాంతి సమయంలో పోలీసు అధికారులు ఒక్కో చోట ఒక్కో చట్టాన్ని ఒక్కోలా అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము అన్నారు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు ఒక భాగం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
‘హైందవ సంప్రదాయంలో సంక్రాంతి పండుగకు ప్రాముఖ్యత ఎక్కువ. ఇది రైతులకు సంబంధించిన పండగ. గ్రామీణ ప్రజలు చేసుకునే పండగ. అన్నింటికి మించి సంస్కృతికి సంప్రదాయానికి పెద్ద పీట వేసే పండగ. భోగి మంటను ప్రారంభించడం ద్వారా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ సంక్రాంతి పండగ అందరి ఇళ్లలోనూ వెలుగులు నింపాలని కోరుకుంటున్నా.
కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనడం విశేషం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు ఒక చక్కటి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి భోగి మంటను ప్రారంభించడం, కేబినెట్ మంత్రులు అంతా కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, సీనియర్ జడ్జిలు వేడుకల్లో పాల్గొనడం ఇది ఒక మంచి సంప్రదాయం. మంచి ఆరంభం. కచ్చితంగా ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక మంచి అనుభూతి.
Also Read : మహాకుంభమేళాలో మొదటి రోజు 60 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు.. ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం!
సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోలీసు అధికారులు పెడుతున్న ఆంక్షలు పనికి రాని హడావుడి లాంటిది. మనం ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు కానీ, జూదం కానీ ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదని మేమే చెబుతాం. తమిళనాడు రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం. జల్లికట్టు వారి సంప్రదాయం, దాన్ని అనుమతించాలని కోర్టులు తీర్పును ఇచ్చాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి చేస్తన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆడతారు. మహిళలకు ముగ్గుల పోటీలు పెడతారు, గొబ్బెమ్మలు పెడతారు. ఇన్ని రకాల ఆటలతో పాటు కోడి పందాలు అనేది సంప్రదాయం.
సంక్రాంతి అనగానే పోస్టర్ లో కోళ్లు కనిపిస్తాయి. అంటే కోడి పందాలు ఆడతారని కాదు కదా. అదొక సంప్రదాయం. దానిపై దాడి చేయొద్దు అంటున్నా. జూదాన్ని అరికట్టండి. సంప్రదాయంపై దాడి చేస్తే హైందవ జాతి ఒప్పుకోదు. హైందవ జాతి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. జూదాన్ని అరికట్టండి. చట్టాన్ని అన్ని చోట్ల సమానంగా పాటించండి. ఒక్కో చోట ఒక్కోలా చట్టాన్ని అమలు చేయడం కరెక్ట్ కాదు. మంచి పద్ధతి కాదు.
కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి మద్దతును ఏపీ ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. గతంలో అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి కేంద్రం తన మద్దతు ఇచ్చింది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి మద్దతిచ్చారు. 2లక్షల కోట్లు ఇచ్చారు. భవిష్యత్తులో రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ రాబోతోంది. ఇదంతా ఏపీని అభివృద్ది చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచన, ఆకాంక్ష. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది” అని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు.
Also Read : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన భక్తులు