Vijayawada Police: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్

విజయవాడ నగర పరిధిలో నగర పరిధిలో అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల కట్టడికి విజయవాడ నగర పోలీసులు, రైల్వే పోలీసులు జాయింట్ అపరేషన్ తో ముందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.

Vijayawada Police: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక డ్రైవ్

Vijayawada City

Updated On : May 9, 2022 / 1:54 PM IST

Vijayawada Police: విజయవాడ నగర పరిధిలో నగర పరిధిలో అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల కట్టడికి విజయవాడ నగర పోలీసులు, రైల్వే పోలీసులు జాయింట్ అపరేషన్ తో ముందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం డివిజనల్ రైల్వే సెక్యూరిీటి ఆఫీసర్ బిటి వల్లేశ్వర్, నగర పోలీసు కమిషనర్ కాంతి రానా టాటా..స్పెషల్ ట్రైన్లో ప్రత్యక్షంగా వెళ్లి రైల్వే స్టేషన్, ట్రాక్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణ టాటా మీడియాతో మాట్లాడుతూ రైల్వే ట్రాక్స్, లోకో షేడ్స్ ఆవాసాలుగా చేసుకొన్న బ్లేడ్ బ్యాచ్ ముఠాసభ్యులపైనా, గంజాయి ముఠాపైనా ఫోకస్ చేసినట్లు వివరించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రైల్వే పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో నేరాలకు ఆవాసాలుగా ఉన్న మొత్తం 15 ప్రాంతాలను గుర్తించామని, ప్రయాణికులు కాకుండా ఎవరైనా కారణం లేకుండా స్టేషన్, ట్రాక్స్ వెంట వస్తున్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని కమిషనర్ కాంతి రానా టాటా హెచ్చరించారు.

Also Read:Cyclone Asani: ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

మద్యం, గంజాయి సేవిస్తూ దొంగతనాలకు పాల్పడేవారిపై ఇకపై ఉక్కు పాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. జీఆర్పీ పోలీసులకు అదనంగా నగర పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపి నేరాల కట్టడికి ఇకపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆర్పిఎఫ్ డివిజనల్ రైల్వే సెక్యూరిీటి ఆఫీసర్ బిటి వల్లేశ్వర్ మాట్లాడుతూ ప్రయాణికులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై రైల్వే యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను అరికట్టడం లక్ష్యంగా అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతామని వల్లేశ్వర్ హెచ్చరించారు. అందుకోసం రైల్వే ట్రాక్స్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు, నగర పోలీసులతో కలిసి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు..లోకో షేడ్, ట్రాక్స్ వెంబడి ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేస్తామని బీటీ వల్లేశ్వర్ పేర్కొన్నారు.

Also read:Infibeam R Srikanth: ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యనిర్వాహకాధికారి ఆర్.శ్రీకాంత్ దంపతుల దారుణ హత్య