విజయవాడ మెట్రో ఫుల్ డిటెయిల్స్.. ఏయే రూట్లు.. ఎక్కడెక్కడ స్టాప్స్.. ఎంత ఖర్చు.. ఎప్పటి వరకు పూర్తవుతుంది?
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

AP Metro Rail Projects
AP Metro Rail Projects: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జూలై 25న ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రజలకు దీనిపై ఆసక్తి నెలకొంది. విజయవాడ మెట్రోలో ఏయే రూట్లలో వెళ్తాయి? ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
విజయవాడ మెట్రోను పరిశీలిస్తే ఇది 66.2 కిలోమీటర్లు. దీన్ని ఫేజ్ 1A, ఫేజ్ 1B, ఫేజ్ 2B మూడు భాగాలు చేశారు.
ఫేజ్ 1A: గన్నవరం బస్టాండ్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఉంటుంది. దీని పొడవు 25.9కి.మీ. ఇందులో 23 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో ఉంటుంది. అంటే హైదరాబాద్‌లో ఉన్నట్టు రోడ్డు పైన పిల్లర్లు వేసి ఆ పైన రైలు ట్రాక్ ఉంటుంది. 2.9 కిలోమీటర్ల మేర మాత్రం అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. యోగాశ్రం, గన్నవరం ఎయిర్ పోర్టు, కీసరపల్లి దగ్గర అండర్ గ్రౌండ్ మెంట్రో ఉంటుంది.
ఫేజ్ 1A రూట్, స్టాప్స్.. గన్నవరం బస్టాండ్, గన్నవరం, యోగాశ్రం, గన్నవరం ఎయిర్ పోర్టు, కీసరపల్లి, వేల్సూరు, గూడవల్లి, శ్రీచైతన్య కాలేజ్, నిడమానూరు రైల్వే స్టేషన్, నిడమానూరు, ఎనికేపల్లి, ఎంబీటీ
సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ ఈస్ట్, రైల్వే స్టేషన్ సౌత్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. (అంటే ఒక రకంగా ఇది ఏలూరు రోడ్ రూట్ )
ఫేజ్ 1B : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీని పొడవు 12.5 కి.మీ. మొత్తం ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. భూగర్భంలో ఏమీ ఉండదు.
ఫేజ్ 1A రూట్, స్టాప్స్ : పండిట్ నెహ్రూ బస్టాండ్, విక్టోరియా మ్యూజియం, మున్సిపల్ స్టేడియం. టిక్కల్ రోడ్, బెంజ్ సర్కిల్, ఆటో నగర్, అశోక్ నగర్, కృష్ణా నగర్, కానూరు సెంటర్, తాడిగడప, పోరంకి,
పెనమలూరు వరకు ఉంటుంది. (అంటే ఇది ఒక రకంగా బందర్ రోడ్ రూట్). ఫేజ్ 1 మొత్తం 38.4 కిలోమీటర్లు
ఫేజ్ 2 : ఫేజ్-2 విషయానికి వస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి రిజర్వాయర్ స్టేషన్ వరకు ఉంటుంది. దీని పొడవు 27.8 కిలోమీటర్లు. ఇందులో కేవలం 4.7 కిలోమీటర్లు మాత్రమే ఎలివేటెడ్ కారిడార్. మిగిలిన 23.1 కిలోమీటర్ల రైలు మాత్రం అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. అంటే బస్టాండ్ నుంచి అమరావతిలోకి ఎంట్రీ అయ్యేవరకు ఎలివేటెడ్ రాడార్ ఉంటుంది. అమరావతిలో మొత్తం అండర్ గ్రౌండ్ కారిడార్. ఫేజ్ 2లో కృష్ణానది మీద బ్రిడ్జిని కూడా నిర్మించాల్సి ఉంటుంది.
ఫేజ్ 2 రూట్, స్టాప్స్ : విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, మహానాడు, కృష్ణా కెనాల్ జంక్షన్, పొల్కంపాడు, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, వెంకటపాలెం (తూర్పు), వెంకటపాలెం (పశ్చిమం), తాళ్లాయపాలెం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, ది స్క్వేర్ స్టేషన్, సెంట్రల్ పార్క్ స్టేషన్, సెరిమొనియల్ స్పేస్ స్టేషన్, అసెంబ్లీ స్టేషన్, ఎఫ్ జీ స్టేషన్, జీహెచ్‌స్టేషన్, అమరావతి రిజర్వాయర్ స్టేషన్
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం.. విజయవాడ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం కలిపి 66.2 కిలోమీటర్లు. ప్రస్తుతం దీంట్లో ఫేజ్ 1 మీద ముందుకు వెళ్లనుంది ప్రభుత్వం. దీనికోసం రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలవనుంది. దీన్ని ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి? అనే అంశం టెండర్లలో పొందుపరచనుంది ప్రభుత్వం.