సాయన్న నోట కర్మ సిద్ధాంతం..లిక్కర్ కేసులో వాట్‌నెక్స్ట్..!? రెండోసారి విచారణకు వెళ్లి విజయసాయి ఏం చెప్పబోతున్నారు?

అదే నిజమైతే.. రజత్‌ భార్గవ్‌ చెప్పిన వాళ్లెవరు? విజయసాయి ప్రస్తావిస్తున్న వైసీపీ అధినేత కోటరీనా?

సాయన్న నోట కర్మ సిద్ధాంతం..లిక్కర్ కేసులో వాట్‌నెక్స్ట్..!? రెండోసారి విచారణకు వెళ్లి విజయసాయి ఏం చెప్పబోతున్నారు?

VijaySai Reddy

Updated On : July 12, 2025 / 8:03 PM IST

లిక్కర్ కేసు..ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఆ కేసులో వరుస అరెస్టులు, లీకులు..వైసీపీకి తెలియని టెన్షన్‌, ఆందోళన కలిగిస్తున్నాయట. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ నుంచి మళ్లీ పిలుపురావడంతో వైసీపీ కీలక నేతల గుండెలు గుభేల్‌మంటున్నాయని టాక్. ఇప్పటికే ఓ సారి సిట్ విచారణకు వెళ్లి వచ్చిన విజయసాయికి..రెండోసారి నోటీసులు అందాయి.

అయితే ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉండటంతో..సిట్‌ విచారణకు రాలేనని ప్రకటించారు. సిట్‌ విచారణకు వెళ్లే తేదీని త్వరలోనే చెబుతానన్నారు. సేమ్‌టైమ్‌ సిట్‌ విచారణకు రాలేని అంటూనే..విజయసాయి చేసిన ఓ ట్వీట్ చర్చకు దారితీస్తోంది. ఆ పోస్ట్‌లో కర్మఫలాల గురించి భగవద్గీతలోని శ్లోకాన్ని పోస్ట్ చేశారు. దీంతో..కర్మ ఫలాలపై ఉన్న ఈ శ్లోకం జగన్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారా..లేక ఇంకెవరి టార్గెట్‌గా ట్వీట్ చేశారనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఇటువంటి పాన్‌పై వంటలు వండుతున్నారా? అదే విషాన్ని వెదజల్లుతూ.. డేంజర్‌ బెల్స్‌..

ఏప్రిల్‌ 18న ఫస్ట్ టైమ్‌ సిట్‌ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి..సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే లిక్కర్‌ కేసు దర్యాప్తులో దూకుడు పెరిగింది. సూత్రధారులు, పాత్రధారులు, బిగ్‌ బాస్‌ అంటూ విజయసాయిరెడ్డి సెన్సేషనల్‌ కామెంట్స్ చేసిన తర్వాతే దర్యాప్తు స్పీడప్ అయింది. ఇప్పటివరకు 11 మంది అరెస్ట్‌ అయ్యారు. లిక్కర్‌ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి అని విజయసాయి చెప్పిన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో కీలకంగా పనిచేసిన ధనుంజయరెడ్డి కూడా జైలు పాలయ్యారు.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. ఇదే కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ACB కోర్టులో చుక్కెదురు అయింది. మోహిత్‌రెడ్డి ముందస్తు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని మోహిత్‌రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు చేసింది. దర్యాప్తు స్పీడప్‌..అరెస్ట్‌లు..కస్టడీలు..బెయిల్ పిటిషన్లు ఇవన్నీ ఓవైపు నడుస్తుండగానే..లేటెస్ట్‌గా విజయసాయిరెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు పంపించడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.

సిట్‌ ఎలాంటి క్వశ్చన్స్‌ అడగబోతోంది?
అయితే ఈసారి సిట్‌ విచారణకు హాజరైతే విజయసాయిని.. సిట్‌ ఎలాంటి క్వశ్చన్స్‌ అడగబోతోంది? ఆయన సిట్‌కు ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలోనే రాజ్‌కసిరెడ్డి పేరు చెప్పి సంచలనానికి దారి తీసిన విజయసాయి..ఇప్పుడు కర్మ సిద్దాంతం అంటూ ట్వీట్ చేశారంటే..పెద్ద తలకాయనే టార్గెట్‌ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇండైరెక్టుగా జగన్ కోటరీని నమ్మి..నష్టపోయారని..అందుకు ఫలితం అనుభవించాల్సిందేనన్నట్లుగా విజయసాయి ట్వీట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

సిట్‌ విచారణలో కూడా విజయసాయిరెడ్డి జగన్‌, ఆయన కోటరీ పేర్లు ప్రస్తావించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలు పేర్లు కానీ, ఎంపీ మిథున్‌రెడ్డి పేరు కానీ విజయసాయి ప్రస్తావిస్తే..కీలక దశలో ఉన్న లిక్కర్‌ కేసులో ఇప్పుడాయనిచ్చే వాంగ్మూలం కీలకం కానుంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి రెండోసారి సిట్‌ నోటీసులు అనే వార్త వైసీపీ కీలక నేతలను టెన్షన్ పుట్టిస్తోందట. మొదటిసారి విచారణప్పుడే జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వ్యక్తుల పేర్లు చెప్పారు విజయసాయిరెడ్డి.

ఇప్పుడు రెండోసారి సిట్‌ ముందుకు వెళ్తే ఎవరి పేర్లు చెప్తారు..మీడియాతో మాట్లాడేప్పుడు ఏ బాంబ్ పేల్చుతారోననేది ఫ్యాన్ పార్టీలో హీట్‌ను క్రియేట్ చేస్తోందట. ఇక ఇప్పటికే విచారణకు హాజరైన..రిటైర్ట్ ఐఏఎస్..రజత్‌ భార్గవ్‌ సిట్‌కు ఏం చెప్పారనే దానిపై కూడా వైసీపీ కీలక నేతలు ఆరా తీస్తున్నారట. అయితే తనకేం తెలియదు..అంతా వాళ్లే చేశారని రజత్‌ భార్గవ్‌ సిట్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అదే నిజమైతే..రజత్‌ భార్గవ్‌ చెప్పిన వాళ్లెవరు.? విజయసాయి ప్రస్తావిస్తున్న వైసీపీ అధినేత కోటరీనా.? ఆ కోటరీలో ఎవరెవరున్నారు.? ఇలాంటి అంశాలు ఫ్యాన్ కింద ఉండగానే ఫ్యాన్ పార్టీ లీడర్లకు చెమటలు వచ్చేలా చేస్తున్నాయట. విజయసాయిరెడ్డి రెండోసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత..లిక్కర్ కేసులో ఎలాంటి డెవలప్‌మెంట్స్‌ ఉంటాయో చూడాలి మరి.