ఇటువంటి పాన్‌పై వంటలు వండుతున్నారా? అదే విషాన్ని వెదజల్లుతూ.. డేంజర్ బెల్స్..
ఇది ఆహారాన్ని పాన్‌కు అంటుకోకుండా చేస్తుంది. దీంతో పాన్‌ను శుభ్రం చేయడం కూడా చాలా సులువు.

బాగా వేయించిన గుడ్డు తినడం అంటే చాలా మందికి ఇష్టం కదా? పాన్‌పై గుడ్లను వేయించుకుని తింటాం. ఆ సమయంలో పాన్‌కు గుడ్డు అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలాంటి నాన్‌స్టిక్ పాన్ (పదార్థాలు అతుక్కుపోకుండా ఉండే పొర ఉన్న పాన్)ల వల్ల వండటమూ సులువు, తర్వాత క్లీన్ చేయడమూ చాలా ఈజీ.
కానీ మనకు ఇష్టమైన ఇటువంటి పాన్ వల్ల మన శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. మీకు పిల్లలు పుట్టే శక్తి తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీకు భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడే ముప్పు ఉంది.
పాన్‌కి, అనారోగ్యానికి సంబంధం ఏంటి?
నాన్‌స్టిక్ పాన్‌ల తయారీలో PTFE (పాలిటెట్రాఫ్లోరోఎథైలీన్)ను వాడతారు. నాన్ స్టిక్ పాన్‌లలో పూత పూయడానికి ఉపయోగించే ప్రధాన రసాయనమే PTFE. దీనిని సాధారణంగా “టెఫ్లాన్” (దాని బ్రాండ్ పేరు) అని పిలుస్తారు. పాన్‌పై దీనితో పూత పూస్తారు. ఇది మెరుస్తూ కనపడుతుంది. నాన్ స్టిక్ పాన్‌కు జారే గుణాన్ని ఇది ఇస్తుంది. ఇది ఆహారాన్ని పాన్‌కు అంటుకోకుండా చేస్తుంది. దీంతో పాన్‌ను శుభ్రం చేయడం కూడా చాలా సులువు.
Also Read: గుడివాడలో టెన్షన్ టెన్షన్.. ఫ్లెక్సీల వివాదం.. టీడీపీ వర్సెస్ వైసీపీ
పూత కోసం పాలీటేట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE)ను వాడి తయారు చేసిన పాన్ వల్ల మనుషుల్లో పిల్లలు పుట్టే శక్తి తగ్గే ప్రమాదం ఉండడంతో పాటు, భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడే ముప్పు ఉందని వైద్యులు చెబుతున్నారు.
PTFE (టెఫ్లాన్) తయారీలో PFAS రసాయనాలను కూడా వాడతారు. పాన్‌పై PTFE రసాయనం స్థిరంగానే ఉంటుంది. అయితే, ఒకవేళ పాన్ స్క్రాచ్ అవడం, ఎక్కువ వేడి కావడం, పాతపడటం వంటి సందర్భాల్లో అందులో నుంచి PFAS రసాయనాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ రసాయనాలు ఆహారంలోకి చేరి, శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
PFAS శరీరంలోకి వెళ్తే మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవరీయన్ కణాల తగ్గుదల, ముందస్తు మెనోపాజ్ వంటి సమస్యలు ఏర్పడతాయని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం… గర్భిణుల శరీరంలోకి PFAS వెళ్తే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, ప్రీక్లాంప్షియా వంటి గర్భ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంటుంది.
ఈ రసాయనాలు ప్లాసెంటా ద్వారా గర్భంలోకి కూడా వెళ్లగలవని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల గర్భంలో ఉన్న శిశువు జనన వ్యవస్థ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక పురుషుల శరీరంలోకి ఈ రసాయనాలు వెళ్తే టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గడం, స్పెర్మ్ కదలికలు బలహీనపడటం, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, అసాధారణంగా స్పెర్మ్ శాతం పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు అంటున్నారు.
ఇటీవలి పరిశోధనల్లో మానవ అండాలు తయారయ్యే ప్రాంతమైన ఫాలిక్యులర్ ఫ్లూయిడ్‌లో కూడా PTFE అణువులు ఉన్నట్టు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇది అండం అభివృద్ధి జరిగే చోట ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు.