గుడివాడలో టెన్షన్ టెన్షన్.. ఫ్లెక్సీల వివాదం.. టీడీపీ వర్సెస్ వైసీపీ

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగే కే కన్వెన్షన్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది.

గుడివాడలో టెన్షన్ టెన్షన్.. ఫ్లెక్సీల వివాదం.. టీడీపీ వర్సెస్ వైసీపీ

Updated On : July 12, 2025 / 5:47 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని గుడివాడకు వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని అంటున్నారు.

గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంతో పాటు టీడీపీ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read: బ్లూ టిక్ కావాలా నాయనా..! ఎక్స్ (ట్విటర్) బ్లూ టిక్ మస్త్ చీప్.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు తగ్గించిన మస్క్

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగే కే కన్వెన్షన్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది.

మాజీ మంత్రి పేర్ని నాని కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. మరోవైపు, గుడివాడ కే కన్వెన్షన్ లో వైసీపీ “బాబు ష్యూరీటీ.. మోసం గ్యారంటీ” సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మాజీమంత్రి కొడాలి నాని, జిల్లా వైసీపీ నాయకత్వం హాజరుకాలేదు. స్థానిక నాయకుల నేతృత్వంలోని సమావేశం జరుగుతోంది.