iPhone Wedding Card : వైజాగ్ జంట వినూత్న ఆలోచన.. ఐఫోన్ పోలిన వెడ్డింగ్ కార్డు.. నెటిజన్లు ఫిదా..!

Visakhapatnam Couple's iPhone-Themed Wedding Card ( Image Source : Google )
iPhone Wedding Card : ఇప్పుడు ట్రెండ్ మారింది.. వెడ్డింగ్ కార్డ్ అనేది కేవలం ఇన్విటేషన్ మాత్రమే కాదు.. దంపతుల అభిరుచి, శైలికి ప్రతిబింబం. దంపతుల ప్రత్యేక రోజు గురించి స్నీక్ పీక్. ఇటీవలి సంవత్సరాలలో పెళ్లిళ్ల సమయంలో ఫ్యాన్సీ, కస్టమైజడ్ వెడ్డింగ్ కార్డులు ప్రత్యేకింగా నిలుస్తున్నాయి. చాలామంది వధువరులు తమ వెడ్డింగ్ కార్డు విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. కాలానికి అనుగుణంగా, విశాఖపట్నంలో ఒక జంట ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ మాదిరిగా ప్రత్యేకమైన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.
Read Also : Viral Video : నువ్వు సూపర్ అక్కా.. పామును మహిళ ధైర్యంగా ఎలా చేతులతో పట్టుకుందో చూశారా? వీడియో వైరల్!
లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆహ్వానానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్‌ను పోలి ఉండేలా రూపొందించిన వినూత్న వెడ్డింగ్ ఇన్విటేషన్ అందరిని ఆకట్టుకుంటోంది. మొత్తం మూడు పేజీలలో బుక్‌లెట్-డిజైన్ లేఅవుట్‌తో రూపొందించారు. కవర్ పేజీలో ఫోన్ వాల్‌పేపర్ మాదిరిగా జంట ఫోటోను ‘బ్యాక్‌గ్రౌండ్’గా కనిపిస్తుంది. ఫొటో పైన వివాహ సమయం, తేదీ వివరాలు ప్రముఖంగా ప్రింట్ చేశారు. ఇన్విటేషన్ లోపల ఉన్న పేజీలలో ఒకటి వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మాట్ కలిగి ఉంది.
View this post on Instagram
3డీ మాదిరి డిజైన్.. ఐడియా అదుర్స్ :
“సెండ్ లొకేషన్” క్యాప్షన్, వేదిక వివరాలు ఉన్నాయి. ఇంతలో, ఇన్విటేషన్ ‘బ్యాక్ కవర్’ అద్భుతమైన కెమెరా ఇలస్ట్రేషన్‌ను కలిగి ఉంది. 3డీ మాదిరిగా డిజైన్ చేసి ఉంది. ఇప్పటివరకు ఈ వీడియో 15 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంటర్నెట్ యూజర్లు ఈ ప్రత్యేకమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోయారు.
తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పెళ్లి కార్డుల ఖరీదు గురించి కూడా కొందరు ఆరా తీశారు. ”ఒక డిజైనర్ వివాహం చేసుకున్నప్పుడు.. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది’’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరో యూజర్ ‘చాలా ఖరీదైన వెడ్డింగ్ కార్డ్’ అని చమత్కరించారు.
View this post on Instagram
మూడో యూజర్… మీ ఆలోచన బాగుందని మెచ్చుకోగా.. నాల్గో యూజర్ ”నువ్వు నిజంగా ప్రతిభావంతుడివి” అని కామెంట్ చేశాడు. గతంలో, కంపెనీ రోజువారీ వస్తువుల నుంచి ప్రేరణ పొందిన ఇతర వినూత్న డిజైన్‌లను కూడా రూపొందించింది.
ఐఫోన్-ఫార్మాట్ ఇన్విటేషన్లతో పాటు సంప్రదాయ ఆహ్వాన ఆకృతికి ఆహ్లాదకరమైన అంశాన్ని జోడించి, పాస్‌పోర్ట్‌లు, వార్తాపత్రికలను పోలి ఉండే వెడ్డింగ్ కార్డులను అందిస్తారు. గతేడాది రీసెర్చ్ పేపర్‌లా ఉండే ఓ యూనిక్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరిగా, వెడ్డింగ్ కార్డు టైటిల్‌లో వివాహ వేదికతో పాటు జంట పేర్లు కూడా ముద్రించారు. వివాహం ప్రాముఖ్యతను కూడా అందులో వివరించారు.
View this post on Instagram