ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తి విమానం ఎక్కి వెళ్లాడు: విశాఖ సీపీ
Visakha CP Ravi Shankar: అగంతకుడు చాలా సార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్ లోకి వెళ్లి వచ్చినట్టు సీపీ రవి శంకర్ తెలిపారు.

vizag cp ravi shankar
విశాఖలో ఓ గుర్తు తెలియని దుండగుడు గత అర్ధరాత్రి తహసీల్దార్ రమణయ్యపై దాడి చేసి చంపడం కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించారు. విశాఖ సీపీ రవి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గంటల్లోనే నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు.
రాత్రి పది గంటల సమయంలో అగంతకుడు రాడ్డుతో రమణయ్యపై దాడి చేశాడని సీపీ రవి శంకర్ అన్నారు. తమకు డయల్ 112కి కాల్ వచ్చిన వెంటనే ఘటనా స్థలికి వెళ్లామని తెలిపారు. దుండగుడు వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్టు గుర్తించామని చెప్పారు. ఈ కేసును ఛేదించడానికి పది టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు.
అగంతకుడు చాలా సార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్ లోకి వెళ్లి వచ్చినట్టు సీపీ రవి శంకర్ గుర్తించామన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే విశాఖ పోలీసులు వెళ్లారని చెప్పారు. కాగా, కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో రమణయ్యపై హత్య జరిగింది. రమణయ్యతో ముందుగా ఆ దుండగుడు వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో దాడి చేసి చంపాడు. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమని అన్నారు.