Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయిన బోగీలు

ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి.

Visakha Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయిన బోగీలు

Updated On : September 17, 2022 / 9:02 PM IST

Visakha Express : ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి. స్టేషన్ లో రైలు ఆగే సమయంలో లింక్ తప్పింది. దీంతో ప్రాణాపాయం తప్పింది. అదే సమయంలో ట్రైన్ నెమ్మదిగా వెళ్లడంతో బోగీల్లోని ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారు. కాగా, ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఏలూరు రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. శిరిడీ నుంచి వస్తున్న శిరిడీ ఎక్స్ ప్రెస్ విశాఖ వెళ్లాల్సి ఉంది. స్టేషన్ కు వచ్చే సమయంలో ట్రైన్ బాగా స్లో అయ్యింది. సరిగ్గా అదే సమయంలో లింక్ ఊడిపోయింది. దీంతో మూడు బోగీలు రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో ఈ లింక్ ఊడిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.

రైలు కొంత వేగంగా ఉన్న సమయంలో లింక్ కనుక ఊడిపోయి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. అయితే ప్రమాదమేమీ జరక్కపోవడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, రెండు గంటల పాటు విశాఖ వెళ్లాల్సిన రైలు ఏలూరు రైల్వేస్టేషన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. లింక్ తెగిన చోట మరమ్మతులు చేశారు. తిరిగి బోగీలను ట్రైన్ కు లింక్ చేశారు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది.