విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన…కన్నీరు తెప్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు

  • Published By: srihari ,Published On : May 16, 2020 / 03:33 PM IST
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన…కన్నీరు తెప్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు

Updated On : May 16, 2020 / 3:33 PM IST

విశాఖ గ్యాస్ లీక్ ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చల్లగాలితో నిశ్శబ్ధంగా మృత్యువు జత కట్టింది. నిద్రిస్తున్న వారిపై కనికరం లేకుండా విషవాయువు దాడి చేసింది. కొన్ని గంటలపాటు నరకం జనం
చూసింది. విశాఖలో అర్ధరాత్రి అల్లకల్లోలం సృష్టించింది. విషవాయువు దాడిలో 12 మంది మృతి చెందారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దృశ్యాలు 10 టీవీ చేతికి చిక్కాయి. సీసీటీవీ దృశ్యాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. 

విశాఖపట్నం కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా ఇబ్బందులు పడ్డారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీచేసింది.

గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన నష్టానికి గానూ వెంటనే ప్రాథమికంగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎన్జీటీ ఆదేశించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18వ తేదీలోపు నివేదిక సమర్పించేందుకు ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ బి శేషసయానారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

లైఫ్, ప్రజారోగ్యం మరియు పర్యావరణానికి ఎంతవరకు నష్టం జరిగిందనే దాని గురించి విచారణ చేపట్టిన ట్రిబ్యునల్..  గ్యాస్ లీకేజీకి ప్రభావితమైన ఆర్ఆర్ పురంలో పెద్ద ఎత్తున పశువులు, పక్షులు, చెట్లు కూడా నాశనమైనట్లు గుర్తించింది. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకున్న గ్రీన్ ట్రిబ్యునల్.. విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.