విశాఖలో పబ్జీ గేమ్ ఆడి పిచ్చోడయ్యాడు

విశాఖలో పబ్జీ గేమ్ కు బానిస అయిన యువకుడు చివరకు మతిస్థిమితం కోల్పోయి పిచ్చోడయ్యాడు. అరకులోయ మండలానికి చెందిన

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 06:40 AM IST
విశాఖలో పబ్జీ గేమ్ ఆడి పిచ్చోడయ్యాడు

Updated On : June 11, 2020 / 6:40 AM IST

విశాఖలో పబ్జీ గేమ్ కు బానిస అయిన యువకుడు చివరకు మతిస్థిమితం కోల్పోయి పిచ్చోడయ్యాడు. అరకులోయ మండలానికి చెందిన

విశాఖలో పబ్జీ గేమ్ కు బానిస అయిన యువకుడు చివరకు మతిస్థిమితం కోల్పోయి పిచ్చోడయ్యాడు. అరకులోయ మండలానికి చెందిన కౌశిక్ నిత్యం పబ్జీ ఆడేవాడు. ఈ క్రమంలో అతడు మానసికంగా దెబ్బతిన్నాడు. కొద్ది రోజులుగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. కౌశిక్ తీరుతో భయపడ్డ కుటుంబసభ్యులు వెంటనే అతడిని మానసిక వైద్య శాలకు తరలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు పబ్జీ గేమ్ కు బానిస కావడం వల్లే మతిస్థిమితం కోల్పోయాడని తేల్చారు. ప్రస్తుతం కౌశిక్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు:
లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న కౌశిక్ పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. కొన్ని రోజులుగా అతడి మానసిక ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది. ఆటలో లీనమైపోయిన కౌశిక్ అచ్చం గేమ్ లో లానే వ్యవహరిస్తున్నాడు. కౌశిక పరిశీలించిన డాక్టర్లు అతడు మెంటల్ గా డిప్రెస్ కు గురైనట్టు చెప్పారు. మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే చాలా ప్రమాదం అన్నారు. అరకు మండల కేంద్రంలో చాలా మంది యువకులు ఇలానే పబ్జీ గేమ్ కు బానిసలుగా మారారు. ఒక గ్రూప్ గా తయారైన యువకులు నిత్యం సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నారు. తల్లిదండ్రులు వెంటనే దీన్ని అరికట్ట లేకపోతే మరికొందరు పిచ్చోళ్లయ్యే ప్రమాదం ఉందని, ప్రాణాలు కూడా కోల్పోవచ్చని డాక్టర్లు హెచ్చరించారు.

24 గంటలూ పబ్జీ గేమ్ లోనే:
కౌశిక్ తీరుతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. అతడి పిచ్చి చేష్టలతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుక్కి నయం చేయాలని డాక్టర్లను వేడుకున్నారు. ముందుగా కౌశిక్ పబ్జీ గేమ్ నుంచి బయటపడేలా చూడాలని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలని, అతడి మైండ్ ను డైవర్ట్ చేయాలని చెప్పారు. కౌశిక్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా కాలేజీ మూతపడింది. దీంతో ఇంటికే పరిమితమై కౌశిక్ పబ్జీ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. క్రమంగా దానికి అడిక్ట్ అయ్యాడు. ఉదయం లేచింది మొదలు మొబైల్ ఫోన్ తీసుకోవడం పబ్జీ గేమ్ ఆడటం, ఇదీ అతడి వరుస. ఆఖరికి తిండీ తిప్పలు కూడా లేకుండా రాత్రి సమయంలో నిద్రపోకుండా మరీ గేమ్ ఆడుతున్నాడు. ఈ కారణంతోనే అతడు పిచ్చోడు అయినట్టు తెలుస్తోంది. 

సరిపడ నిద్ర, తిండి లేకపోవడమే కారణం:
సరిపడ తిండి, నిద్ర లేకపోవడం, 24 గంటలూ గేమ్ ధ్యాస్ లోనే ఉండటం, గేమ్ లో స్టేజ్ లెవల్స్ చుట్టూ ఆలోచనలు ఉండటం, ఏ విధంగా షూట్ చేయాలి.. ఇలాంటి ఆలోచనల కారణంగా కౌశిక్ మతిస్థిమితం కోల్పోవడానికి కారణాలని డాక్టర్లు చెప్పారు. ఒక్క కౌశిక్ మాత్రమే కాదు ఇంకా చాలామంది యువకుడు ఇలానే పబ్జీ గేమ్ కు బానిసలయ్యారు. వారి తల్లిదండ్రులు వెంటనే మేల్కోకపోతే ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు.

Read: ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం, యువతి నుంచి భారీగా డబ్బు దండుకున్నాడు