Visakhapatnam : కాసేపట్లో కూతురి పెళ్లి, తల్లిదండ్రుల మృతి..కేసు అప్ డేట్

విశాఖ జిల్లా మద్దిలపాలెంలో కాసేపట్లో కన్న కూతురి వివాహం జరుగుతుందనగా..తల్లిదండ్రులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. అసలు వీరు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఎవరికీ తెలియరాలేదు.

Visakhapatnam : కాసేపట్లో కూతురి పెళ్లి, తల్లిదండ్రుల మృతి..కేసు అప్ డేట్

Vishaka

Updated On : August 27, 2021 / 1:11 PM IST

Visakhapatnam Maddilapalem : విశాఖ జిల్లా మద్దిలపాలెంలో కాసేపట్లో కన్న కూతురి వివాహం జరుగుతుందనగా..వధువు తల్లిదండ్రులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. అసలు వీరు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఎవరికీ తెలియరాలేదు. మృతులు విశాఖపోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులుగా పోలీసులు గుర్తించారు. దీనిపై 2021, ఆగస్టు 27వ తేదీ శుక్రవారం సీఐ రమణయ్య స్పందించారు.

Read More : Potatoes : ఆలుగడ్డతో ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే అస్సలు వదలిపెట్టరు

వధువు తల్లి గత 15 సంవత్సరాలుగా మానసిక సమస్యతో బాధ పడుతున్నారని, 26వ తేదీ ఉదయం పెళ్లిలో భార్య భర్తల మధ్య వివాదం తలెత్తిందన్నారు. మందులు వేయడానికని తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని తండ్రి జగన్నాథరావుకు చెప్పిందని తెలిపారు. దీంతో అతను ఇంటికి తీసుకెళ్లాడని, అయితే..చాలా సేపటి వరకు రాకపోయే సరికి కుటుంసభ్యులు వారింటికి చేరుకున్నారన్నారు. ఇంటికి వెళ్లి చూడగా..ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నట్లు, భార్య ప్రవర్తనతో విసుగు చెంది…భర్తే హత్య చేసి ఉంటాడనే అనుమానం ఉందన్నారు. దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతోందన్నారు.

Read More : Wife Viral Shopping List :ఏ భార్యా ఇంత డిటెయిల్‌గా భర్తకు షాపింగ్ లిస్టు ఇచ్చి ఉండదేమో..!

ఈ విషయంలో జగన్నాథరావు తమ్ముడు కుమారుడు స్పందించారు. పెద్దమ్మ అనారోగ్యంతో ఉన్నా..చాలాకాలం భరించారని, పెదనాన్నచాలా మంచివారన్నారు. వీరి మధ్య ఎలాంటి విబేధాలు మాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెళ్లి మండపంలో జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. పెళ్లిలో అన్యయ్యను తిడుతుంటే..అక్క సర్ధి చెప్పిందని, గొడవ ఎక్కువ కావడంతో…అమ్మను ఇంటికి తీసుకెళ్లి..మందులు వేయాలని అక్క చెప్పిందన్నారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లారని, ఎంతసేపటికీ రాకపోవడంతో…ఇంటికి వెళ్లి చూసేసరికి…వారు చనిపోయి ఉన్నారని ఆయన తెలిపారు. పోలీసుల దర్యాప్తులో ఎలా చనిపోయారు ? భార్యను హత్య చేసిన అనంతరం జగన్నాథరావు ఆత్మహత్య చేసుకున్నాడా ? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.