విశాఖలో లీకైన విషవాయువు..5కి.మీ పరిధిలో వ్యాపిస్తుంది, 48గంటలపాటు ఎఫెక్ట్ చూపిస్తుంది

విషవాయువు లీక్ అవ్వడంతో విశాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విషవాయువు తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్.జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి స్టైరిన్ మోనోమర్ వాయువు లీక్ అయిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకైన ప్రాంతానికి సమీపంలోని స్థానికుల్లో చాలామంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కళ్లు కనిపించక నరక యాతన అనుభవిస్తున్నారు. వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఆరుగురు మృతిచెందారు. పచ్చని చెట్లు కూడా నల్లగా మారిపోయాయి. ఇంతకీ, ఈ విషవాయువు ఏంటి? దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందని అనేదానిపై బయో సైంటిస్టు సుందర రామయ్య వివరణ ఇచ్చారు.
దీన్ని స్టెర్లిన్ గ్యాస్.. బర్నింగ్ గ్యాస్ అంటారని చెప్పారు. మార్కెట్లో అవసరం లేని గ్యాస్ లను కొన్ని ఇండస్ట్రీలు వాడుతుంటాయన్నారు. ఉత్పత్తి అయ్యే బర్నింగ్ గ్యాస్ లీక్ కావడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. ఎంత శాతంగా గ్యాస్ బయటకు లీక్ అయింది అనేది పూర్తి అవగాహన లేదన్నారు. లీకైన గ్యాస్ తీవ్రత మాత్రం ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. గ్యాస్ పీల్చిన వారిలో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పారు. గ్యాస్ ఎంత పరిమాణంలో విడుదలయినప్పటికీ అది సుమారుగా 5 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు వ్యాపిస్తుందని సంబంధించిన నిపుణులు చెబుతున్నారని తెలిపారు.
బేస్ కార్నర్.. గ్యాస్ కెపాసిటీ నుంచి బయటకు వస్తుందని చెప్పారు. వాల్ కట్ చేసే సమయానికి ఉత్పత్తి అయిన గ్యాస్ అంతా ఒకేసారి లీక్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్యాస్ బయటకు రాగానే పీల్చిన వ్యక్తిపై తీవ్ర ప్రభావం ఉంటుందని సుందర రామయ్య చెబుతున్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో గ్యాస్ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. గ్యాస్ పీల్చిన వారు వెంటనే అస్వస్థతకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఒకసారి ఈ గ్యాస్ పీల్చినవారిలో కొద్దిపాటి శ్వాస కోశాలు, శ్వాసనాళాలతో బాధపడినవారిందరిలో దీర్ఘకాలిక జీవితం ప్రభావం ఉంటుందని చెప్పారు.
నాడి మండల వ్యవస్థ కొంత క్షీణించే అవకాశం ఉందన్నారు. ఎంత క్షీణిస్తుంది అనేదానిపైనే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుందని సుందర రామయ్య వివరించారు. గాల్లో కలిసిన గ్యాస్ పరిమాణాన్ని బట్టి సమస్య లెక్కించవచ్చునన్నారు. గాలి ఫీల్చగానే శ్వాసకోశాలు, శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందన్నారు. బర్నింగ్ సెన్స్ కారణంగా ఊపిరితిత్తుల్లో మంట మొదలవుతుంది. అక్కడి నుంచి ఇతర అవయావాలకు గ్యాస్ వ్యాపించడంతో మనిషిలో వ్యాధినిరోధక శక్తి కోల్పోయి చనిపోయే అవకాశం ఉందన్నారు.
Also Read | విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన మోడీ,రాహుల్