Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత మృతదేహం కేసు.. పూర్తి వివరాలు తెలిపిన పోలీసులు

Vizag Swetha Case: సీపీ త్రివిక్రమ్ వర్మ పూర్తి వివరాలు తెలిపారు. గత మంగళవారం సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య మణికంఠతో శ్వేత మాట్లాడిందని చెప్పారు.

Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత అనే యువతి మృతదేహం లభ్యమైన కేసుపై సీపీ త్రివిక్రమ్ వర్మ పూర్తి వివరాలు తెలిపారు. శ్వేత అనే అమ్మాయి మృతదేహం YMCA బీచ్ లో లభ్యమైందని అన్నారు. శ్వేత తల్లి రమాదేవితో తాను మాట్లాడానని తెలిపారు. శ్వేత భర్త కొద్ది రోజుల క్రితం ఉద్యోగం రీత్యా హైదరాబాద్ కు వెళ్లాడని చెప్పారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉందని, ఆ భూమి తన పేరు మీదకి మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడని తెలిపారు.

ఫిబ్రవరిలో ఒక సారి శ్వేత ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. అత్తింటి వారి వేధింపుల కారణంగా గతంలో ఆత్మహత్యకి పాల్పడిందని అన్నారు. ఆమెను అత్త, మామలు చిన్నచూపు చూసేవారని వివరించారు. శ్వేతపేరు మీద ఉన్న భూమి విషయంలో ఆమె అత్తింట్లో చిత్రహింసలకు గురైందని అన్నారు.

శ్వేత చెప్పులు ఆమె మృతదేహానికి 100 మీటర్ల దూరంలో లభ్యం అయ్యాయని చెప్పారు. శ్వేత ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. పోస్ట్ మార్టం వీడియో గ్రఫీ చేయించామని చెప్పారు. ఐపీసీ సెక్షన్ 354 498(ఏ) కింద కేసు నమోదు చేశామని అన్నారు. బీచ్ లో దొరికిన బట్టలు శ్వేతవి కాదని చెప్పారు. గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో శ్వేత ఆత్మహత్యకి పాల్పడిందని అనుకుంటున్నామని తెలిపారు.

అదే రోజు సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య మణికంఠతో శ్వేత మాట్లాడిందని చెప్పారు. మణికంఠ మళ్లీ 8 గంటలకి ఆమెకు ఫోన్ చేశాడని తెలిపారు. 8.15 గంటలకు శ్వేత తల్లి రమాదేవికి అత్తింటివారు ఫోన్ చేసి శ్వేతకనపడడం లేదని సమాచారం ఇచ్చారని చెప్పారు.

Visakha Swetha Case : విశాఖ బీచ్‌లో మృతదేహం కలకలం.. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?

ట్రెండింగ్ వార్తలు