Visakha Swetha Case : విశాఖ బీచ్‌లో మృతదేహం కలకలం.. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?

Visakha Swetha Case: సాధారణంగా బీచ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడితే 24గంటల వరకు బాడీ దొరకదు. శ్వేత బాడీ మాత్రం ఇసుకలో కూరుకుపోయి ఉందని, శ్వేత దుస్తులు అక్కడ రాయిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Visakha Swetha Case : విశాఖ బీచ్‌లో మృతదేహం కలకలం.. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?

Visakha Swetha Case

Visakha Swetha Case : విశాఖ బీచ్ లో అనుమానాస్పద రీతిలో వివాహిత శ్వేత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. శ్వేత కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటే 24గంటల వరకు మృతదేహం బయటకు రాదని చెబుతున్నారు. అయితే, శ్వేత రాత్రి మిస్ అయితే తెల్లవారుజామున మృతదేహం దొరికింది. ఆ మృతదేహం కూడా కొద్దిపాటి దుస్తులతో ఇసుకలో కూరుకుపోయి లభించడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో శ్వేతను ఎవరైనా చంపి ఇసుకలో పూడ్చి వేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

అటు మృతురాలి తల్లి రమ కూడా అత్తింటి వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురిని అత్తింటి వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. శ్వేత భర్త రెండుసార్లు ఆమె గొంతు నొక్కాడని, శ్వేత మామ గొంతు నొక్కి చంపేస్తానంటూ బెదిరించాడని తన కూతురు తనకు చెప్పిందని రమ ఆరోపించారు. శ్వేత మృతిపై సమగ్ర దర్యాఫ్తు జరపాలని పోలీసులను వేడుకున్నారు శ్వేత తల్లి రమ.

అంతా అనుమానాస్పదం..

* వైఎంసీఏ బీచ్ లో శ్వేత మృతదేహం లభ్యం.
* అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
* శరీరంపై కొద్దిపాటి దుస్తులతో ఇసుకలో కూరుకుపోయిన మృతదేహం.
* హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాఫ్తు.
* సముద్రంలో దూకి చనిపోతే 24గంటల వరకు డెడ్ బాడీ దొరకదు.
* ఆత్మహత్య చేసుకుంటే దుస్తులు తీసేయాల్సిన అవసరం ఏంటి?

Also Read..Visakha Swetha Case : విశాఖ శ్వేత మృతి కేసులో కీలక విషయాలు.. ఆ లెటర్‌లో ఏముందంటే

”యు నో ఎవ్రీథింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఎప్పుడో తెలుసు. నేను లేకుండా నువ్వు బిందాస్ గా ఉండగలవు. నీకసలు ఏ మాత్రం ఫరక్ పడదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీతో చాలా మాట్లాడాలని ఉంది. బయటకు చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా, నీకంతా తెలుసు” అని శ్వేత రాసిన సూసైడ్ నోట్ లో ఉంది.

ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం శ్వేతకు లేదంటున్నారు ఆమె భర్త మణికంఠ. చిన్న విషయాన్ని కూడా శ్వేత పెద్దదిగా చూసేదన్నారు. ఇంట్లో గొడవలు కామన్ అని చెప్పినా, నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా శ్వేత వినలేదన్నారు.

శ్రీకాకుళం జిల్లా మూలాపేటకు చెందిన శ్వేత రైల్వే ఆసుపత్రిలో ఉద్యోగం చేసేది. ఉద్యోగ రిత్యా గత ఐదేళ్లుగా విశాఖలోని దొండపర్తిలో శ్వేత నివాసం ఉండేది. గతేడాది ఏప్రిల్ 15న నడిపూరు గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మణికంఠతో శ్వేతకు వివాహమైంది. అప్పటి నుంచి అత్తమామలతో కలిసి నడిపూరులోనే శ్వేత ఉంటోంది. 15 రోజుల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వెళ్లాడు భర్త మణికంఠ.

అప్పటి నుంచి తరుచుగా అత్తమామలతో శ్వేతకు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. పెళ్లి సమయంలో కట్నకానులకు బాగానే ఇచ్చారని సమాచారం. పెళ్లి అయిన దగ్గరి నుంచి అత్తమామలతో శ్వేతకు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న(ఏప్రిల్ 25) సాయంత్రం 5గంటలకు అత్తతో శ్వేతకు గొడవ జరిగింది. ఆ తర్వాత భర్త ఫోన్ చేయడంతో.. అతడితోనూ శ్వేత గొడవ పడింది. వెంటనే ఫోన్ కట్ చేసిన శ్వేత ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్లడంతో శ్వేత కోసం అత్తమామలు ఆమె అమ్మ రమకు సమాచారం ఇచ్చారు.

Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

అంతా కలిసి శ్వేత కోసం వెతికారు. అయినా ఆచూకీ లేదు. దీంతో అంతా కంగారుపడ్డారు. రాత్రి 7 గంటలకు శ్వేత తల్లి న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేత 5 నెలల గర్భవతి. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంతలో వైఎంసీఏ బీచ్ దగ్గర గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు త్రీటౌన్ పోలీసులు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు అక్కడికి వెళ్లారు. గుర్తుల ఆధారంగా అది శ్వేత మృతదేహంగా గుర్తించారు. శ్వేత ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేయబడిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

సాధారణంగా బీచ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడితే 24గంటల వరకు బాడీ దొరకదు. శ్వేత బాడీ మాత్రం ఇసుకలో కూరుకుపోయి ఉందని, శ్వేత దుస్తులు అక్కడ రాయిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు. శరీరంపై రాళ్ల రాపిడి గుర్తులు కూడా ఉన్నాయి.