Visakha Swetha Case : విశాఖ శ్వేత మృతి కేసులో కీలక విషయాలు.. ఆ లెటర్‌లో ఏముందంటే

Visakha Swetha Case: అత్తమామలతో గొడవపడి రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతదేహం లభ్యమైంది.

Visakha Swetha Case : విశాఖ శ్వేత మృతి కేసులో కీలక విషయాలు.. ఆ లెటర్‌లో ఏముందంటే

Visakha Swetha Case

Visakha Swetha Case : విశాఖ బీచ్ లో మృతి చెందిన వివాహిత శ్వేత కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. శ్వేతకు సంబంధించిన సూసైడ్ లెటర్ లభ్యమైంది. ”యు నో ఎవ్రీథింగ్, జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్” అని లెటర్ లో పేర్కొంది శ్వేత. ఇవాళ (ఏప్రిల్ 26) తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతదేహం లభ్యమైంది.

త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతురాలిని పెదగంజాడ నడుపురి గ్రామం గాంధీనగర్ కు చెందిన శ్వేతగా గుర్తించారు. అత్తమామలతో గొడవపడి నిన్న(ఏప్రిల్ 25) రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి న్యూపోర్ట్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. శ్వేత భర్త మణికంఠ ఉద్యోగం రీత్యా హైదరాబాద్ లో ఉంటుండగా, శ్వేత విశాఖలో అత్తమామల దగ్గర ఉంటోంది. ప్రస్తుతం శ్వేత 5 నెలల గర్భవతి అని తెలుస్తోంది. కాగా, విశాఖలో వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.(Visakha Swetha Case)

Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

ఇలా చేస్తుందని ఊహించలేదు-శ్వేత భర్త మణికంఠ
‘గతేడాది ఏప్రిల్ 15న మా పెళ్లి జరిగింది. అరేంజ్ మ్యారేజ్. పెళ్లైన రెండు నెలల నుంచి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో గొడవలు కామనే అని చెప్పా. తనకు నచ్చ చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను. ఏదైనా ఉంటే ఇద్దరం డిస్కషన్ చేసుకుందాం అని చాలా సార్లు చెప్పాను. కానీ శ్వేత వినలేదు. ఇక శ్వేత వాళ్ల అమ్మగారు బాగా డిస్ట్రబ్ చేశారు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ లో ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరికీ గొడవ జరిగింది. శ్వేతను నేను మందలించాను. ఆ తర్వాత కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కాలేదు. మేసేజ్ లు పెట్టినా రెస్పాండ్ కాలేదు.

Also Read..Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

రాత్రి 9 గంటలకు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్లేసరికి శ్వేత ఇంట్లో లేదు. దీంతో శ్వేత గురించి అందరినీ ఆరా తీశారు. చివరికి మిస్సింగ్ కేసు పెట్టారు. అర్థరాత్రి తర్వాత నాకు ఫోన్ వచ్చింది. శ్వేత డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. వెంటనే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేశాను. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద ఇష్యూ చేసేది. శ్వేత వెనకాల ఎంత జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. వాళ్ల అమ్మగారు శ్వేతను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. శ్వేత తల్లి ఇంట్లో జరిగిన విషయాలను బయటివారికి చెప్పేది. శ్వేతకు నాకు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి. నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. నేను మాట్లాడుతుండగానే శ్వేత ఫోన్ కట్ చేసింది. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. శ్వేత ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. సూసైడ్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు’.