JOBS : విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధత స్పెషలేజేషన్‌లోమాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

Jobs (1)
JOBS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ లో వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధత స్పెషలేజేషన్‌లోమాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులకు చివరితేదీ తేదీ: ఆగస్టు 23, 2022 గా నిర్ణయించారు. హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2022గా ప్రకటించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : రిక్రూట్ మెంట్ సెల్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్, కొంకర్కం, విజయనగరం 535003, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.ctuap.ac.in/ పరిశీలించగలరు.