విశ్లేషణ: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం, కేసీఆర్‌తో జగన్ ముఖాముఖి

  • Published By: murthy ,Published On : October 5, 2020 / 07:51 PM IST
విశ్లేషణ: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం, కేసీఆర్‌తో జగన్ ముఖాముఖి

Updated On : October 31, 2020 / 4:13 PM IST

Water sharing row between Telangana and Andhra: కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల్లో వాటాలపై వివాదం. దీనిపైనే మంగళవారం కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్రం జలవనరుల శాఖామంత్రి గజేంద్ర‌సింగ్ షెకావత్‌ రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై సామరస్య పూర్వక పరిష్కారం కనుక్కుంటామంటున్నారు.

గత వారంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులపై కేంద్రానికి ఘాటుగా లేఖ రాసారు. ఏడేళ్లుగా నీటి వాటాలపై తేల్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు ఏపీ అనవసరంగా అభ్యంతరాలు తెలుపుతుందని స్పష్టం చేశారు

అంతేనా, పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ చేస్తోన్న ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిందిగా లేఖలో పొందుపరిచారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్ద్యం పెంచుకోవడంతో పాటు, రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవాలని, అసలు శ్రీశైలం రిజర్వాయల్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు కేసీఆర్.



ఏపీ అభ్యంతరం చెప్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమం అయితే ఏపీ సిఎం జగన్ ఎలా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తారని నిలదీసిన కేసీఆర్, బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ చేసిన కామెంట్లను కూడా తన లేఖలో పొందుపరిచారు. దీంతో పాటే అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ తరపు వాదనని బలంగా విన్పించేందుకు అధికారులకు , నిపుణులకు కీలక సూచనలు చేసారు.

అపెక్స్ కౌన్సిల్ భేటీ వాడి వేడిగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయ్

రాయలసీమ ఎత్తిపోతల పథకం తమ కేటాయింపులకు అనుగుణంగానే ఉందని వాదిస్తోంది ఏపీ. ఐతే రాయలసీమ ఎత్తిపోతలతో, దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, దేవాదుల, తుపాకుల గూడెం, చరఖా-కొరాట, రామప్ప, ప్రాణహిత తదితర ప్రాజెక్టుల‌ను ఏపీ వ్యతిరేకిస్తోంది. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దిగువన ఉన్న తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నది ఏపీ వాదన.



విభజన చట్టానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వ్యతిరేకమని, తాము పాత ప్రాజెక్టులనే రీ-డిజైన్ చేస్తున్నామన్నది తెలంగాణ ప్రభుత్వ క్లారిటీ.

తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఈ మధ్యనే కేజీఆర్బీ సమావేశాల్లోనూ ఇరు రాష్ట్రాల అధికారులు తమ తమ వాదనలు విన్పించారు. ఐనా వివాదం కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ కమిటీ భేటీకి అందుకంత ప్రాధాన్యత.


https://youtu.be/BWL87hnQQxI