మాజీ మంత్రి పేర్నినానిలో అగ్రెషన్ ఎందుకు పెరిగినట్లు? ఇలా బుక్ అయిపోతే ఎలా పేర్నినాని అంటూ టీడీపీ సైటైర్లు..
టీడీపీపై అటాక్ చేయబోయి..వైసీపీని ఇరకాటంలో పడేయడమే కాదు..ఇప్పటికే కేసులు ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇరికించేలా పేర్నినాని మాట్లాడారన్న చర్చ జరుగుతోంది.

Perni Nani
పేర్నినాని.. మాజీ మంత్రిగానే కాదు..వైసీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ గళమై వినిపిస్తున్న నేతగా ఎప్పటినుంచో జనాలకు సుపరిచితుడే. ఆయనేం మాట్లాడిన ఓ లైన్‌లో..జాగ్రత్తగా మాట్లాడుతారన్న భావన ఉంటుంది. వ్యంగ్యంగా మాట్లాడినా..ఆ మాత్రం వెటకారం కామన్ అనే చర్చ ఉండేది. ఈ మధ్య పలు మీటింగ్‌లలో పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయ్.
రప్పా రప్పా డైలాగుల మీద..రప్పా రప్పా ఏంటి..చీకట్లో కన్ను కొడితే పనైపోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబును ఉద్దేశించి..70ఏళ్ల వయసులో ఉన్నావ్..ఎంతకాలం బతుకుతావ్ అంటూ పేర్నినాని మాట్లాడిన మాటలు కూడా విమర్శలకు దారి తీస్తున్నాయ్. ఆ తర్వాత కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ కారుపై దాడి..ఘటనపై పేర్నినాని మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో బయటికి రావడం ఆయనకు తలనొప్పిగా మారిందట.
లేటెస్ట్‌గా బయటకొచ్చిన కాల్ వీడియోను కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట పేర్నినాని. అధికార పార్టీని ఇరుకున పడేసే స్కెచ్ వేస్తోన్న పేర్నినాని..చివరకు తనకు తానే వివరణ ఇచ్చుకునే పరిస్థితిని ఫేస్ చేస్తున్నారట. రెండు రోజుల క్రితం ఆయన ఫోన్ కాల్ వీడియో బయటకు రావటం..అది కాస్త సంచలనంగా మారటం ఒక ఎత్తు అయితే..పెడనలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మరోసారి తన నోటికి పని చెప్పారు పేర్ని నాని.
కామెంట్స్‌పై తెలుగు తమ్ముళ్ల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంత కాలం బతుకుతావ్..? అంటూ నాని చేసిన కామెంట్స్‌పై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. బియ్యం స్కామ్ విషయంలో తన భార్య అరెస్టును చంద్రబాబు ఆపారని..మహిళల పట్ల ఆయనుకున్న గౌరవం అలాంటిదన్న మెచ్చుకున్న పేర్నినాని..ఇప్పుడు చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడేముందు ముందూ వెనుక చూసుకోనక్కర్లే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
టీడీపీపై అటాక్ చేయబోయి..వైసీపీని ఇరకాటంలో పడేయడమే కాదు..ఇప్పటికే కేసులు ఫేస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇరికించేలా పేర్నినాని మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. చీకటిలో నరికేయండని అనలేదని తన మాటలకు వివరణ ఇస్తూనే..వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేశ్ మాట్లాడారని గుర్తు చేశారు పేర్నినాని. ఐదు నెలలు వంశీని జైల్లో ఉంచారు. ఏం చేశావ్ అంటూ మాట్లాడారు పేర్నినాని.
అంతేకాదు ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగుపెట్టబోతున్నాడు..ఎవడొస్తాడో రండ్రా.. దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం అంటూ ఇంకో డైలాగ్ వదిలారకు. కార్యకర్తలను ఉత్సాహ పనిచేందుకు మాట్లాడటం సరే కానీ..పార్టీని, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న నేతలను ఇరికించేలా కామెంట్స్ చేయడం ఏంటి నాని అని ఇంటా బయట చర్చ జరుగుతోందట. ఓవరాల్‌గా పేర్నినాని తీరు చూస్తుంటే చిన్న గీతను చెడిపేయడానికి పెద్ద గీతను గీస్తున్నట్లుగా కనిపిస్తోంది.