కాళ్లపారాణి ఆరకముందే : భర్తకు విషమిచ్చిన భార్య

పెళ్లై వారం రోజులు గడువ లేదు. ఏమైందో కానీ..భర్తకు విషమిచ్చిందో భార్య. అపస్మారక స్థితికి చేరుకున్న అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో లింగమయ్యకు, యువతితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. కానీ..ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇంటి కుటుంబసభ్యులు సర్దిచెబుతుండే వారు. కానీ..పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇదిలా ఉంటే…నవంబర్ 18వ తేదీ సోమవారం పాలల్లో విషం కల్పి ఇచ్చింది భార్య. ఈ విషయం తెలియని లింగమయ్య..పాలు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
ఇతని పరిస్థితిని చూసిన సోదరుడు గుత్తి ఆస్పత్రికి తరలించాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలియనుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More : గవర్నర్‌ను కలువనున్న ఏపీ సీఎం జగన్