Yarlagadda Lakshmi Prasad : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
న్డీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీలను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొలగించాలని సూచించడం పెద్ద వివాదానికి దారితీసింది.

Yarlagadda Lakshmi Prasad
NTR Plexi Controversy : ఎన్డీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీలను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొలగించాలని సూచించడం పెద్ద వివాదానికి దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంటోంది. నిన్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా బాలయ్యపై ఫైర్ అయ్యారు. తాజాగా మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీల తొలగింపు విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఉండి నియోజకవర్గం టీడీపీలో తారాస్థాయికి వర్గపోరు.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య టికెట్ రగడ
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ (తారక్) ఆకాశంలో ఉన్నారు. ఆయన్ను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టే అవుతుంది. బాలకృష్ణ అయినా, ఇంకవెరైనా సరే అంటూ పేర్కొన్నారు. తారక్ ఎదుగుదలకు కారణం ఆయన తల్లినే. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో బాలకృష్ణ ప్రమేయం కానీ, ఇంకెవ్వరి ప్రమేయం లేదంటూ యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనా యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విజయాలకు, అపజయాలకు జగన్ మోహన్ రెడ్డిదే బాధ్యత అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసుంటూ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం రేపు (శనివారం) లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్, ఇండ్ల రామ సుబ్బారెడ్డి, విల్సన్ సుధాకర్, రాధాకృష్ణం రాజులను లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.