PM Narendra Modi : కొబ్బరి నీళ్లు, సాత్విక ఆహారం.. రామ మందిర ప్రతిష్టాపనకు ముందు మోదీ పాటిస్తున్న నియమాలు ఇవే!

దేశం మొత్తం రామ నామ జపమే వినిపిస్తోంది. మరో మూడు రోజుల్లో దేశంలోని హిందువులు భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది.

PM Narendra Modi : కొబ్బరి నీళ్లు, సాత్విక ఆహారం.. రామ మందిర ప్రతిష్టాపనకు ముందు మోదీ పాటిస్తున్న నియమాలు ఇవే!

PM Narendra Modi

Updated On : January 19, 2024 / 9:42 AM IST

Ram Mandir : దేశం మొత్తం రామ నామ జపమే వినిపిస్తోంది. మరో మూడు రోజుల్లో దేశంలోని హిందువులు భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు జనవరి 22వ తేదీతో తెరపడనుంది. 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఆలయ సంప్రోక్షణకు జనవరి 12 నుంచి పూజా కార్యక్రమాలు, ఆచారాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే, ఈ సమయంలో ప్రధాని మోదీ కఠినమైన నియమాలు అనుసరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read : Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

రామ మందిర ప్రతిష్ఠ కోసం తాను ప్రత్యేక పూజలు చేస్తున్నానని ప్రధాని మోదీ జనవరి 12న చెప్పారు. క్రతువు పూర్తయ్యే వరకు మోదీ కఠిన నియమకాలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొబ్బరి నీళ్లు, సాత్విక ఆహారం తీసుకోవడం, నేలపై నిద్రపోవడం వంటివి ఇందులో ఒక భాగం. 22వ తేదీ వరకు ప్రధాని మోదీ వీటిని పాటించనున్నారు. ఉదయాన్నే నిద్రలేచి సాత్విక ఆహారం తీసుకోవడమేకాకుండా, రోజుల్లో పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను కూడా మోదీ సందర్శిస్తున్నారు. రాముడు వనవాస సమయంలో కొంతకాలం గడిపిన నాసిక్ లోని పంచవటిని ప్రధాని మోదీ సందర్శించారు. కేరళలోని గురువాయుర్ ఆలయాన్ని, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు వీరభద్ర ఆలయాన్నికూడా ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే.

ఈ వారాంతంలో ప్రధాని మోదీ తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. శనివారం సాయంత్రం తిరుచిరాపల్లిలోని శ్రీ అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు. ఆదివారం ధనుష్కోడిలోని కోదండరామస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించి, ఆపై రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పబడే అరిచల్ మునైకి మోదీ వెళతారు.

Also Read : Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం

మరోవైపు పవిత్రోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాల వద్ద పరిశుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. గతవారం ప్రధాని మోదీ.. స్వచ్ఛత అభియాన్ (పరిశుభ్రత డ్రైవ)లో భాగంగా మహారాష్ట్ర నాసిక్ లోని కాలరామ్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు ఆలయాల వద్ద శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.