YCP Fourth List: ఏ క్షణంలోనైనా వైసీపీ నాలుగో జాబితా విడుదల
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో కృపా లక్ష్మి బరిలోకి దిగే అవకాశం ఉంది.

YCP Fourth List: వైసీపీ నాలుగో జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఇప్పటికే వైసీపీ మూడు జాబితాల్లో ఇన్‌చార్జిల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 14 చోట్ల మార్పులు చేస్తూ నాలుగో జాబితా విడుదలకు సిద్ధమైంది. ఎనిమిది అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జిలను ప్రకటించనుంది. మార్పులు, చేర్పులపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో కృపా లక్ష్మి బరిలోకి దిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామి తన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు. ఆమె పోటీకి దిగకపోతే మరోసారి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని నారాయణస్వామి భావిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కూడా మరో వర్గం అంటోంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జి స్వామి దాస్ ఇటీవలే వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా స్వామి దాస్‌కు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరారు.
ఈ స్థానాల్లో ఈ అభ్యర్థులు?
మార్కాపురం- జంకె వెంకటరెడ్డి
తిరువూరు-స్వామిదాస్
గంగాధర నెల్లూరు-కృపా లక్ష్మి
యలమంచిలి- గుడివాడ అమర్‌నాథ్
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రసకందాయంలో రాజకీయం