K. Ramakrishna : ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వైసీపీ గుండాలు దాడి దుర్మార్గం : కె.రామకృష్ణ
దాడికి పాల్పడిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

K. Ramakrishna Fire YCP
K. Ramakrishna Fire YCP : వైసీపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. కావలి సమీపంలో మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వైసీపీ గుండాలు దాడి చేసి చితకబాదటం దుర్మార్గం అన్నారు.
దాడికి పాల్పడిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బస్సు హారన్ మోతకే వైసీపీ బేజారెత్తిపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయనటానికి కావలి ఘటనే నిదర్శనం అన్నారు.