Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్‌షాక్.. మరో కేసులో 14రోజుల రిమాండ్
Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. గుంటూరు కోర్టు ఆయనకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది.
Ambati Rambabu
Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు 22రోజులు రిమాండ్ విధించింది.
పట్టాభిపురం పీఎస్‌లో నవంబర్ 12న అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అప్పట్లోనే ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో సోమవారం అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఈనెల 22వరకు ఆయనకు రిమాండ్ విధించింది.
ఇప్పటికే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. ఆయన్ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన్ను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.
