YCP leader warning to Chandrababu: చంద్రబాబు కుప్పం వస్తే.. ఆయన కారుపై బాంబులు విసురుతా..!

కుప్పంలో.. YCP నేత సెంథిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కుప్పంకు చంద్రబాబు వస్తే.. ఆయన కారుపై బాంబులేస్తానంటూ సెంథిల్ చేసిన కామెంట్లపై TDP శ్రేణులు ఆందోళన చేశాయి.

YCP leader warning to Chandrababu: చంద్రబాబు కుప్పం వస్తే.. ఆయన కారుపై బాంబులు విసురుతా..!

Senthil

Updated On : October 22, 2021 / 4:19 PM IST

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు.. రాజకీయ రచ్చ సృష్టిస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు బూతులు దాటి బెదిరింపుల వరకూ వెళ్తున్నారు. టీడీపీ నేత పట్టాభి.. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లు మొదలు.. ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబు అంతు చూస్తామనేంత వరకూ వెళ్లాయి.

తాజాగా.. చంద్రబాబు సొంత నియోజకవర్గం.. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతలు జనాగ్రహ దీక్ష చేశారు. రెస్కో చైర్మన్ గా పని చేస్తున్న జీఎస్ సెంథిల్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిపై కామెంట్లు చేస్తే… చంద్రబాబు కారుపై బాంబులు వేస్తానని హెచ్చరించారు. దమ్ముంటే కుప్పంకు చంద్రబాబు రావాలని సవాల్ విసిరారు. పక్కనే ఉన్న ఎంపీ రెడ్డప్ప వారించే ప్రయత్నం చేసినా.. సెంథిల్ మాత్రం ఆవేశాన్ని కొనసాగించారు.

చేతనైతే పట్టాభి చేసిన కామెంట్లు తప్పు.. అని టీడీపీ నేతలు చెప్పాలని సెంథిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పట్టాభి చేసిన కామెంట్ల తర్వాత.. టీడీపీ కార్యాలయంపై దాడి.. తర్వాత చంద్రబాబు 36 గంటల దీక్ష.. వైసీపీ నేతల జనాగ్రహ దీక్షల వంటి పరిణామాలతో.. ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. తాజాగా సెంథిల్ కుమార్ కామెంట్లు కుప్పంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.

టీడీపీ కార్యకర్తలు కుప్పంలో నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో కదిలిన పార్టీ శ్రేణులు.. ర్యాలీ నిర్వహించాయి. అదే సమయంలో వైసీపీ నేతలు వారికి ఎదురుపడగా.. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు అతి కష్టమ్మీద వారిని అదుపు చేస్తున్నారు.