జగన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని కొడాలి నాని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు.

జగన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani Key Comments On CM Revanth Reddy

Updated On : January 8, 2024 / 10:53 PM IST

Kodali Nani : వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం మాకేంటి? అని కొడాలి నాని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్ మెంట్లు మాకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సీఎం జగన్ ట్వీట్ చేశారు కదా.. మళ్లీ ఫోన్ చేసి అభినందించాలా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ ఫోన్ చెయ్యలేదని, కనీసం విషెస్ కూడా తెలపలేదని కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్ పై స్పందించిన కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పక్క రాష్ట్రంలో ఎన్నికలకు, మాకు సంబంధం లేదన్నారు కొడాలి నాని. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి ఏపీకి వస్తారేమో? అని కొడాలి నాని అన్నారు.

రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి విరిగిందా? జగన్ పరామర్శించడానికి..

” మేము ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా? తెలంగాణలో కూర్చుని పని చేయటానికి? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సీఎం జగన్ ది ఏమైనా కాంగ్రెస్ లో పార్టీనా? తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. అక్కడున్న పార్టీని కూడా తీసేసి ఏపీకి వచ్చేశాము. వైసీపీని ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేశాం. తెలంగాణలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్నది మాకు సంబంధం లేని విషయం. జగన్ ఎగబడరు, దూరంగా ఉండరు. ఆయన లిమిట్స్ లో ఆయన ఉంటారు. రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టారు. ఫోన్ చేసి అభినందకపోతే ఏమైంది? కేసీఆర్ కి తుంటి విరిగింది కాబట్టి ఆయనను జగన్ పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి. రేవంత్ రెడ్డి అపాయింట్ మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డిది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా?

రేవంత్ ను పట్టించుకునేంత టైమ్ జగన్ కు లేదు..

ఆయనను వాళ్లు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. పదవిని ఎంజాయ్ చేయమన్నారు. నన్ను కలవలేదు? నాకు ఫోన్ చేయలేదు? అని అనడం ఏంటి? అసలు ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు కలవాలి? ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు అయితే ఎవరు సీఎం అయితే వారికి ఫోన్ చేస్తాడు. నేనే నిన్ను గెలిపించాను అని చెబుతాడు. మాకు ఆ పాలసీ లేదు. మేము ఎగబడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డినో, పక్క రాష్ట్రాల సీఎంలను పట్టించుకునే అంత టైమ్ జగన్ కు లేదు. మాకు ఏపీ ప్రయోజనాలు, ఇక్కడి ప్రజలే ముఖ్యం. తెలంగాణలో మాకు వద్దనుకునే, అవసరం లేదనే పార్టీని తీసేశాం. రేవంత్ ను సీఎం రిజైన్ చేసి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వమనండి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

చంద్రబాబు రూ.150 కోట్ల టికెట్ అమ్ముకున్నారు..

చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారు అని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ”150 కోట్లకు విజయవాడ ఎంపీ సీటుని కేశినేని చిన్నికి అమ్మారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానికి చంద్రబాబు మోసం చేశారు. నా గుడివాడ నియోజకవర్గంలో కూడా 100 కోట్లు ఇచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 15వేలు ఇస్తానని, పిల్లలు కనాలని చంద్రబాబు అంటున్నారు. లోకేశ్ 15వేలు ఇచ్చి పిల్లలు కనమని చంద్రబాబు చెప్పొచ్చుగా” అని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?