AP Garbage tax : చెత్త పన్నుగా రూ. 100 వసూలు చేస్తే తప్పేంటీ?ఈ రాద్దాంతమేంటీ : ధర్మాన ప్రసాదరావు

చెత్త పన్నుగా రూ. 100 వసూలు చేస్తే తప్పేంటీ?ఈ రాద్దాంతమేంటీ అంటూ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Garbage tax : చెత్త పన్నుగా రూ. 100 వసూలు చేస్తే తప్పేంటీ?ఈ రాద్దాంతమేంటీ : ధర్మాన ప్రసాదరావు

Garbage Tax In Ap

Updated On : January 4, 2022 / 2:51 PM IST

Dharmana Prasadarao Hot Comments : మాజీమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాట్ హాట్ కామెంట్స్ చేసారు. చెత్త పన్ను గా రూ. 100 వసూలు చేస్తే తప్పేంటీ? అని ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు చేస్తే ఇంత రాద్దాంతం దేనికి ? అందులో పెద్ద విషయం ఏముంది ? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే ఈ రాద్ధాంతాలేంటీ? అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. పన్ను కడితేనే చెత్త తీసుకెళ్లేది..లేదంటే చెత్తను పన్ను కట్టనివారి ఇంటిముందే పోసేస్తాం.. అనుభవించండి తెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం చేపట్టిన పథకాలకు డబ్బులు పంచాలి అంటే పన్నులు వసూలు చేయకపోతే ఎలా డబ్బులెలా వస్తాయి? అంటూ వ్యాఖ్యానించారు.ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వం అని అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు చెత్త పన్ను కట్టకపోతే వారి చెత్త తీసుకెళ్లవద్దని..ఆ చెత్తను వారి ఇంటిముందే పోయాలని..ప్రజలనుంచి చెత్త పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది, అధికారులదేనన్నారు. ప్రజలనుంచి చెత్త పన్ను కట్టించే దిశగా అధికారులు పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ఏపీలో ఇళ్లు, వాణిజ్య సంస్థల నుంచి.. వ్యర్థాల సేకరణ సేవా రుసుం (చెత్త పన్ను) వసూళ్లు మొదలైతే పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉండే కుటుంబాలు కూడా నెలకు రూ.60 నుంచి రూ.120 మధ్యన చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలైతే కేటగిరీని బట్టి నెలకు రూ.100 నుంచి రూ.10,000 వరకూ వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి ఇల్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి నెలనెలా ముక్కు పిండి వసూలు చేయాలనుకుంటున్న ‘చెత్త పన్ను’ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చెత్తపన్నుపై ప్రతిపక్షం కూడా విమర్శలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.