MP YS Avinash Reddy: చంద్రబాబు కమెడియన్ పీస్.. ఆయన అన్నీ అబద్ధాలు మాట్లాడాడు
చంద్రబాబు నాయుడు కమెడియన్ పీస్ అంటూ విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

YCP MP Avinash Reddy
YCP MP Avinash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లా పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన రాజకీయ జీవితంలో చాలాసార్లు పులివెందుల వచ్చానని, ప్రస్తుతం ప్రజల స్పందన చూస్తే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ అని చెప్పారు. పులివెందులలో 2015లో చీని పంటలకు కూడా నీళ్లు ఇచ్చానని చంద్రబాబు అన్నారు. తనకు వయస్సు అయిపోయింది అంటున్నారు.. నా విషయంలో వయస్సు అనేది కేవలం ఒక నెంబరే. నేను సింహాన్ని కొదమసింహాన్ని అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu : పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు తీరని అన్యాయం జరిగింది- చంద్రబాబు తీవ్ర ఆవేదన
చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఒక కమెడియన్ పీస్ అంటూ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేను సింహాన్ని కొదమ సింహాన్ని అని నువ్వు అనుకోకూడదు.. అది ప్రజలు చెప్పాలి చంద్రబాబు అంటూ అవినాష్ సూచించారు. అనుభవజ్ఞుడువై ఉండి ఇంకిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడాడు. ఆయన పులివెందుల వచ్చి అన్నీ అబద్ధాలు మాట్లాడాడు అంటూ అవినాష్ విమర్శించారు. కోవిడ్ టైంలో ఎంతో ఇబ్బంది ఉన్నా అరటి, చీనీ పంటలను కొనుగోలు చేసి 8కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు.
పైడిపాలెం ప్రాజెక్ట్ దివంగత నేత డాక్టర్ వైయస్సార్ ఆలోచన. ఆ మేరకే 650 కోట్లు అప్పుడే ఖర్చు చేశారు. రైతులకు చంద్రబాబు హయాంలోకన్నా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ మేలు జరిగిందని అవినాష్ అన్నారు. కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. 14 ఏళ్లు పాలనచేసి చంద్రబాబు అన్నీ సర్వనాశనం చేశాడని విమర్శించారు. అన్నీ అబద్ధాలు మాట్లాడుతుంటే చంద్రబాబు కమెడియన్‌లా ఉన్నాడంటూ అవినాష్ రెడ్డి అన్నారు.