AP Municipal Election Results 2021 : విశాఖ కార్పొరేషన్ వైసీపీ కైవసం

విశాఖ జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ కార్పొరేషన్‌ ఫ్యాన్‌ పార్టీ వశమైంది.

AP Municipal Election Results 2021 : విశాఖ కార్పొరేషన్ వైసీపీ కైవసం

Vishaka

Updated On : March 14, 2021 / 3:34 PM IST

Visakhapatnam Corporation : విశాఖ జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ కార్పొరేషన్‌ ఫ్యాన్‌ పార్టీ వశమైంది. మొత్తం 98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖలో అధికార వైసీపీ 55 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ 29, జనసేన 4, ఇండిపెండెంట్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఒక్కో స్థానాల్లో విజయం సాధించారు.

విశాఖ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను స్థానిక ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ…ఆ నిర్ణయంలో అధికార వైసీపీ పాత్ర ఏమీ లేదని వారు నమ్మినట్టు ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి.

బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి అన్ని ఫలితాలు వెలువడాలంటే సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.