వికటించిన ఫేస్‌బుక్‌ ప్రేమ..యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్నం

వికటించిన ఫేస్‌బుక్‌ ప్రేమ..యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్నం

Updated On : December 21, 2020 / 6:08 PM IST

Young woman suicide attempt : ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు దారి తీసింది. ఫేస్‌బుక్‌ వేదికగా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో చిత్తూరు జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కత్తివారిపల్లికి చెందిన శ్రీలతకు హిందూపురానికి చెందిన వినోద్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన ఫేస్‌బుక్‌ పరిచయం కాస్తా… ప్రేమగా మారింది. ఇద్దరు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే వినోద్‌కుమార్‌ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ప్రేమించిన శ్రీలతను కొన్నిరోజులుగా దూరం పెడుతూ వస్తున్నారు. తనను దూరం పెట్టడంతో మనస్తాపం చెందిన శ్రీలత ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి తల్లిదండ్రులు ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.