ఘోర ఓటమిపై వైసీపీ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
YS Jagan: సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని..

YS Jagan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు కలిశారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకున్నారు. జగన్‌ను కలవడానికి వచ్చిన వారిలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు.
ఇవాళ సాయత్రం 5 గంటలకు గవర్నర్ ను వైఎస్సార్సీపీ నేతలు కలవనున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పిర్యాదు చేయనున్నారు.
ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ ఘోరంగా ఓడిపోవడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే.
Also Read: వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారు: గుడివాడ అమరనాథ్