YS Jagan: సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: వైఎస్‌ జగన్ ఆగ్రహం

ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్బంధం చేస్తున్నారని చెప్పారు.

YS Jagan: సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: వైఎస్‌ జగన్ ఆగ్రహం

Chandrababu-Jagan

Updated On : November 7, 2024 / 4:03 PM IST

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్బంధం చేస్తున్నారని చెప్పారు. వరద సాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని, 91 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరిగాయని చెప్పారు. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని అన్నారు.

వారం రోజులుగా విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారని జగన్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదని తెలిపారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు. నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు.

మద్యం మాఫియాపై ప్రశ్నించినా, ఉచిత ఇసుకపై ప్రశ్నించినా కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. తాను సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు.

మాటలతో కాకుండా చేతలతోనే మా ప్రభుత్వం పనితనం చూపుతోంది: పవన్ కల్యాణ్