చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది: ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్

చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని తెలిపారు.

చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది: ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్

Updated On : October 4, 2024 / 3:23 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కోసం మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని తెలిపారు.

ఇటువంటి రాజకీయ నాటకాలు ఆడవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్లుగా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేశారని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.

దేవుడిని రాజకీయాలను దూరంగా ఉంచాలని సుప్రీకోర్టు తెలిపిందని జగన్ అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడి తీరు మారడం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడికి భయంతో పాటు భక్తి లేదని, ఒకవేళ అవి ఉంటే ఇప్పటికైనా ఆయన మారి ఉండేవారని అన్నారు. టీడీపీ సామాజిక మాధ్యమాల్లోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడి తీరును జాతీయ మీడియా కూడా తప్పు పట్టిందని చెప్పారు.

KA Paul: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో కేఏ పాల్ పిటీషన్.. ఇప్పటికిప్పుడు అలా చేయలేమన్న కోర్టు