YS Jagan : సీఎం జగన్ కీలక నిర్ణయం…ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు

వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

YS Jagan : సీఎం జగన్ కీలక నిర్ణయం…ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు

Jagan Ap

Updated On : November 19, 2021 / 11:37 AM IST

AP Rains : ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో..సీఎం జగన్…2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా..ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ..ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Read More : Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు…మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు

ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని, మంచి భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలని..వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని, రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారికి కిందకు రాకుండా పైనే ఉంచాలని టీటీడీ అధికారులకు సూచించారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని ఆదేశించారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు.

Read More : New Farm Laws : వ్యవసాయ చట్టాలు రద్దు…ఇది రైతు విజయం

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందని, చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు తెలుస్తోందని తెలిపారు సీఎం జగన్. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చామన్నారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించినట్లు, వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామని అధికారులు వెల్లడించారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
మరోవైపు… చెన్నైకి సమీపంలో వాయుగండం తీరాన్ని తాకే అవకాశముంది. దీంతో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.