అన్న, చెల్లి ఆస్తుల లొల్లి.. మధ్యలో ప్రభుత్వం..!

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లు షర్మిల తన మీదకు బదిలీ చేసుకోవడం.. వివాదం కోర్టు మెట్లెక్కింది.

అన్నాచెల్లెళ్ల ఆస్తుల గొడవ రోజురోజుకు ముదురుతోంది. రోజురోజుకు పీక్‌ లెవల్‌కు చేరుకుంటోంది. ఐదు నెలలుగా డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. మాజీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల మధ్య ఆస్తి పంపకాలు ఎటూ తేలడం లేదు. పైగా ఇద్దరు రాజకీయాల్లో ఉండటం..వారసత్వంగా YSR నుంచి వచ్చిన ప్రాపర్టీస్‌పై వివాదం కాస్త టాక్‌ ఆఫ్‌ది టూ స్టేట్స్‌గా మారింది. అంతేకాదు మధ్యలో కూటమి సర్కార్‌ ఎంట్రీతో సీన్‌ మరింత ఇట్రెస్టింగ్‌ మారుతోంది. జగన్‌ కంపెనీ భూములపై పవన్‌ ఆరా తీయడం..అంతకముందు కుటుంబ గొడవపై జగన్‌ను కార్నర్ చేస్తూ చంద్రబాబు కామెంట్స్‌ చేయడంతో కొత్త చర్చ మొదలైంది.

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లు షర్మిల తన మీదకు బదిలీ చేసుకోవడం.. వివాదం కోర్టు మెట్లెక్కింది. వాళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతోన్న కంపెనీ షేర్లు, ఆస్తి చుట్టూ కాంట్రవర్సీ కమ్ముకుంది. ఇదే సరస్వతి ఇండస్ట్రీస్‌కు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయనే దానిపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

చంద్రబాబు రియాక్ట్
అయితే సీఎం చంద్రబాబు కూడా జగన్, షర్మిల ఆస్తుల గొడవపై ఆ మధ్య రియాక్ట్ అయ్యారు. కుటుంబ గొడవలను పెద్దగా చేసి చూపిస్తున్నారని..ఎవరి ఇంట్లో గొడవలు ఉండవంటూ జగన్‌ మాట్లాడటంపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ-చెల్లిని కూడా రోడ్డుపైకి లాగిన జగన్ తమను నిందిస్తున్నారని మండిపడ్డారు.

ఆస్తిలో వాటా ఇవ్వాలంటే తనను విమర్శించకూడదని చెల్లికి కండిషన్లు పెట్టేవాడిని ఏమనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌తో ఈ ఇష్యూ ఇంట్రెస్టింగ్‌గా మారింది. పరోక్షంగా షర్మిలకు చంద్రబాబు మద్దతు ఉందని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏపీ సర్కార్‌ డైరెక్టుగా జగన్‌, షర్మిల ఆస్తుల విషయంలో ఇన్వాల్‌ అవుతుందన్నట్లు కనిపిస్తోంది.

అందుకే జగన్‌ ట్రైబ్యునల్‌కు..?
సరస్వతీ ఇండస్ట్రీస్‌ షేర్స్ ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉందంటున్నారు వైసీపీ నేతలు. తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా.. ఆ కంపెనీ షేర్స్‌ను విజయమ్మ..షర్మిలకు బదలాయింపు చేశారని చెప్తున్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల షేర్ల బదిలీతో జగన్ బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని..అందుకే జగన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లారని చెప్పుకొస్తున్నారు. టీడీపీ చేస్తున్న కుట్రలో భాగం అయినందునే షర్మిల, విజయమ్మపై జగన్‌ పిటీషన్ వేయాల్సి వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. బెయిల్ రద్దు కాకుండా ఉండటం కోసమే న్యాయ నిపుణుల సూచనతో జగన్ పిటిషన్ వేశారంటున్నారు.

జగన్‌కు ఆయన సోదరి షర్మిల మధ్య 2019లో ఆస్తి పంపకాలపై ఓ ఒప్పందం జరిగింది. ఆ అగ్రిమెంట్‌ ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీల్లో వాటాల బదిలీ చేసుకోవాలని అనుకున్నారు. అయితే 2021 మార్చిలో జగన్‌ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లను షర్మిల తన పేరు మీదకు బదిలీ చేసుకున్నారు.

తనను ఇబ్బంది పెట్టడానికే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి షర్మిల కంపెనీ షేర్లను బదిలీ చేసుకున్నట్టు భావిస్తున్నారు జగన్. అందుకే ఆయన ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేశారని జగన్‌ సన్నిహితులు చెప్తున్నారు. జగన్‌ పిటీషన్‌ వేయడంపై షర్మిల ఇష్యూ చేయడం మరింత రచ్చకు దారితీసింది. సేమ్‌టైమ్‌ సరస్వతీ ఇండస్ట్రీస్‌ భూములపై ఏపీ సర్కార్‌ ఆరా తీయడం చర్చనీయాంశం అవుతుంది.

ఆ బాధతోనే జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు: మహేశ్ కుమార్ గౌడ్