ఆ బాధతోనే జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు: మహేశ్ కుమార్ గౌడ్
మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ, ముఖ్యమంత్రి కనుసన్నలలోనే జరుగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

Mahesh Kumar Goud
అత్యంత సన్నిహితుడి మరణంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ బాధతోనే జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ, ముఖ్యమంత్రి కనుసన్నలలోనే జరుగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. తాను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నానని, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారి గురించి పొంగులేటి మాట్లాడారని భావిస్తున్నానని అన్నారు.
కొండా సురేఖ మాటలను పార్టీ పరంగా సమర్థించబోమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వెంటనే కొండా సురేఖ తన మాటలు ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన తప్పిదాలకు పదేళ్ళ జైలు శిక్ష కూడా సరిపోదని అన్నారు.
కాళేశ్వరం డిజైన్ మార్చి వ్యయం పెంచి నిర్మించారని తెలిపారు. త్వరలో పీసీసీ నూతన కార్యవర్గ నియామకం ఉంటుందని అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. డీపీసీసీలుగా ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది సమర్థులకు కార్యవర్గంలో స్థానం ఉంటుందని తెలిపారు. చేరికలతో పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు.
కేసీఆర్ కు అప్పుడు ఉన్న ఆర్థిక వెసులుబాటు తమకు ఇప్పుడు లేదని, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అయినా పథకాల అమలు ఎక్కడా ఆపడం లేదని, నెలకు రూ.18 వేల కోట్ల రాబడి ఉంటే..రూ. 11 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పోస్టాఫీస్‌లో ఘరానా మోసం.. ఏకంగా కోటి రూపాయలు మాయం..! అసలేం జరిగిందంటే..