చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం దొమ్మరపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 11:21 AM IST
చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్త హత్య

Updated On : June 8, 2020 / 11:21 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం దొమ్మరపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం దొమ్మరపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త వెంకటేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘర్షణ, హత్యతో దొమ్మరపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. రెండు వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ(జూన్ 8,2020) ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

కొన్నాళ్లుగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు:
ఉదయం నుంచి టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గొడవపడుతున్నారు. బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త వెంకటేష్ ను అతి కిరాతకంగా నరికి చంపారు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయాడు. టీడీపీ మద్దతుదారులే వెంకటేష్ ను చంపేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఘర్షణలో పాల్గొన్న టీడీపీ నేతలు గ్రామం నుంచి పరార్ అయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. గత సార్వత్రిక ఎన్నికల ముగిసిన నాటి నుంచి దొమ్మరపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఆ గొడవలు చివరకు హత్యకు దారితీశాయి.

Read: తీవ్ర విషాదం, మాస్కులా చుట్టుకున్న చున్నీ ప్రాణం తీసింది