వైఎస్‌ జగన్‌ పర్యటన.. బంగారుపాళ్యంలో హైటెన్షన్‌

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు..

వైఎస్‌ జగన్‌ పర్యటన.. బంగారుపాళ్యంలో హైటెన్షన్‌

YS Jagan

Updated On : July 9, 2025 / 2:21 PM IST

YS Jagan Mohan Reddy: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. స్థానిక మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించారు. అయితే, భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అరగొండ ప్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా జగన్ బంగారు పాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మార్కెట్ యార్డు ప్రాంతం జనసందోహంగా మారింది. పోలీసుల వలయం దాటుకొని కొందరు వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డుకు తరలివచ్చారు. మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను జగన్ తెలుసుకోనున్నారు.