Kanumuri Ravi Chandra Reddy: తండ్రి, కొడుకులిద్దరూ ఎన్నికలకు ముందే జైలుకెళ్లడం ఖాయం.. పవన్, పురంధేశ్వరి ఎందుకు నోరువిప్పడం లేదు?

చంద్రబాబుది తవ్వేకొద్ది పాపాలపుట్ట. చంద్రబాబుకు ఐటీ నోటీసులది పెద్ద స్కాం. సింపతీకోసం చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నాడు.

Kanumuri Ravi Chandra Reddy: తండ్రి, కొడుకులిద్దరూ ఎన్నికలకు ముందే జైలుకెళ్లడం ఖాయం.. పవన్, పురంధేశ్వరి ఎందుకు నోరువిప్పడం లేదు?

YCP Spokesperson Kanumuri Ravi Chandra Reddy

Updated On : September 7, 2023 / 1:58 PM IST

YCP Spokesperson Kanumuri Ravi Chandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ ఇద్దరూ ఎన్నికలకు ముందే జైలుకెళ్లడం ఖాయమని వైసీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవి చంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ నోటీసులకు చంద్రబాబు గిలగిల కొట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అపర ద్రుతరాష్ట్రుడులాంటి వాడు.. మిగతావారంతా గాంధర్వులు. చంద్రబాబు ఐటీ నోటీసులపై పురంధేశ్వరి, పవన్‌కల్యాణ్, కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదని రవి చంద్రారెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలకు అడ్డుపడ్డారని అన్నారు.

Telangana Politics: తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు.. సిద్ధాంతాలు, భావోద్వేగాలు మాటలకే పరిమితా?

చంద్రబాబుది తవ్వేకొద్ది పాపాలపుట్ట. చంద్రబాబుకు ఐటీ నోటీసులది పెద్ద స్కాం. సింపతీకోసం చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నాడు. తప్పు చేసినోడు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరంటూ రవి చంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు అనగానే పవన్ కళ్యాణ్ పత్తాలేకుండా పోయాడు. బాబును ప్రశ్నిస్తే పవన్ ప్యాకేజీ లెక్కలు బయటపడతాయని భయం పట్టుకుందని, పవన్ ట్విట్టర్ కూడా మూగపోయిందని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించడానికి బంధుప్రీతి అడ్డువస్తుందా? రామకృష్ణ, నారాయణ ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు.

CPI Narayana : రాజకీయాల్లో అన్ని అర్థరాత్రే జరుగుతుంటాయి ఇది కూడా అంతే : సీపీఐ నారాయణ

చంద్రబాబుకు వచ్చిన నోటీసు ఆరంభం మాత్రమే. ఐటీ నోటీసుల ఇష్యూను డైవర్ట్ చేయడానికే తండ్రి, కొడుకులు కార్యకర్తలపై దాడులంటూ కుట్ర పన్నుతున్నారు. చంద్రబాబుకు పదేళ్ల శిక్ష పడుతుందని అంటున్నారు. చంద్రబాబు వృద్ధ ఖైదీగా రాబోయే రోజుల్లో ఉంటారని అన్నారు. టీడీపీ ఆల్రెడీ దివాళా తీసిన పార్టీ. చంద్రబాబు ఆరోపణనల్లో పసలేదు. మా వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి . తండ్రి, కొడుకులిద్దరూ ఎన్నికలకు ముందే జైలుకు వెళ్లడం ఖాయమని రవి చంద్రారెడ్డి చెప్పారు.