Nara Lokesh : వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అనుచరుడు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అనుచరుడు గొర్ల వేణుగోపాల్ రెడ్డి.. టీడీపీలో చేరారు. వేణుగోపాల్ రెడ్డి సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కే చేతిలో బాధితుడు అని లోకేశ్ అన్నారు. ఇలాంటి భాదితులు రాష్ట్రం మొత్తం ఉన్నారని చెప్పారు.

Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి షాక్ తగిలింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే(ఆళ్ల రామకృష్ణా రెడ్డి) ముఖ్య అనుచరుడు గొర్ల వేణుగోపాల్ రెడ్డి.. టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి వేణుగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేశ్. వేణుగోపాల్ రెడ్డి వెంట భారీగా మంగళగిరి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి తాడేపల్లి వరకు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చారు.
వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కేలపై ఫైర్ అయ్యారు. గొర్లె వేణుగోపాల్ రెడ్డి సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కే చేతిలో బాధితుడు అని అన్నారు. ఇలాంటి భాదితులు రాష్ట్రం మొత్తం ఉన్నారని చెప్పారు. వైసీపీలో ఆత్మగౌరవం లేకే చాలామంది పార్టీని వీడి బయటికి వస్తున్నారని లోకేశ్ వెల్లడించారు. ఒక్క అవకాశం అని ప్రజలను జగన్ మోసం చేశారని లోకేశ్ మండిపడ్డారు. గెలిచాక ప్యాలెస్ పిల్లిలా తాడేపల్లిలో సీఎం జగన్ పడుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ సభలో ఏపీకి కావాల్సినవి జగన్ ఒక్కటి కూడా అడగలేదన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
”సీఎం జగన్ మోదీ సభలో పిల్లి అరుపులు అరిచారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబారెడ్డి మాత్రమే బాగుపడ్డారు. వేణుగోపాల్ రెడ్డి లాంటి జగన్ బాధితులంతా బయటకు రావాలి. ప్యాలెస్ పిల్లి సీఎం అయ్యాక ఏపీ పరువు మొత్తం పోయింది. గంజాయి మత్తులో తాడేపల్లి మండలం మొత్తం నాశనమైంది.
బంగారం లాంటి మంగళగిరిలో శాంతి భద్రతలు లేవు. ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటం గ్రామంలో ఎయిర్ పోర్ట్ కట్టిస్తున్నారు. అందుకే 120 అడుగుల రోడ్డు వేస్తున్నారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. వైసీపీలో ఆత్మగౌరవం లేదని, అక్కడ ఉండలేను అని వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. వైసీపీ కోసం వందల కోట్లు ఖర్చు చేసినా రెడ్డి వర్గం వారికి న్యాయం జరగలేదు. అందుకే వైసీపీలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారంతా బయటికి వచ్చి పోరాడితే టీడీపీ అండగా ఉంటుంది. ఎన్టీఆర్, చంద్రబాబుకు నేను ఏనాడు చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఒకసారి మాత్రమే గెలిచింది. ఈసారి గెలిచి చరిత్ర తిరగరాయలి” అని లోకేశ్ అన్నారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరనున్న తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి నేత గొర్ల వేణు గోపాల్ రెడ్డి, పలువురు వైసిపి కార్యకర్తలు.https://t.co/9gVchH6b8p
— Telugu Desam Party (@JaiTDP) November 13, 2022