YSRCP-TDP : టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తల దాడి
గుంటూరు జిల్లా మంగళిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Ysrcp Workers Attack On Tdp Office At Guntur Mangalagiri
Ysrcp-TDP : గుంటూరు జిల్లా మంగళిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని నేతలపైనా కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chigurupati Jayaram : NRI చిగురుపాటి జయరాం హత్య కేసు-పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి బెదిరింపులు
మరోవైపు టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. పట్టాభి ఇంట్లోని పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. గంజాయి వ్యవహారంపై టీడీపీ కార్యాలయంలో పట్టాభి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వైసీపీ నేతలపై పట్టాభి విమర్శలు చేశారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంతో పాటు పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు.
టీడీపీ కార్యలయం వద్ద వైసీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్‌పై అనుచిత వాఖ్యాలు చేసిన పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మహిళ కార్యకర్తలు చుట్టుముట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కార్యాలయానికి బయల్దేరారు. వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Cocktail Therapy : ఈ యాంటీబాడీల థెరపీ కొవిడ్ బాధితుల పాలిట వరం.. కరోనా సోకినప్పుడు ట్రంప్ ఇదే వాడారు!