Cocktail Therapy : ఈ యాంటీబాడీల థెరపీ కొవిడ్ బాధితుల పాలిట వరం.. కరోనా సోకినప్పుడు ట్రంప్ ఇదే వాడారు!

అమెరికాలో కరోనావైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే థెరపీ చేయించుకున్నారు. అప్పట్లో ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ వార్తల్లో నిలిచింది

Cocktail Therapy : ఈ యాంటీబాడీల థెరపీ కొవిడ్ బాధితుల పాలిట వరం.. కరోనా సోకినప్పుడు ట్రంప్ ఇదే వాడారు!

Antibody Cocktail Therapy Is A Boon For Covid 19 Patients

Monoclonal Antibody Cocktail Therapy : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గినప్పటికీ కొన్నిచోట్ల వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా వైరస్ వ్యాప్తి కంట్రోల్లోకి రావడం లేదు. కరోనా టీకా వేయించుకున్నవారిలోనూ కరోనా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థవంతమైనవి అనే అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లు మిక్సింగ్ ఎలా పనిచేస్తాయనేది కూడా ప్రయోగాలు చేస్తున్నారు. అందులో కొంతవరకు సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ అది ఎంతవరకు సురక్షితమనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనావ్యాక్సిన్లు కేవలం వైరస్ సోకనివారికి మాత్రమే ఇవ్వడానికి వీలుంది. కరోనా బాధితుల పరిస్థితి ఏంటి? అంటే అందుకు ఓ అద్భుతమైన థెరపీ అందుబాటులో ఉంది. అదే.. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ (Monoclonal Antibody Cocktail Therapy).. ఇదివరకే ఈ పేరు వినే ఉంటారు.. అమెరికాలో కరోనావైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో అప్పటి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకింది. అప్పట్లో ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీని ట్రంప్ చేయించుకోవడంతో వార్తల్లో నిలిచింది. ఈ కాక్ టెయిల్ థెరపీ ద్వారా కరోనా సోకినవారు పూర్తిగా కోలుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ థెరపీని భారతదేశంలో చాలామంది వైద్యులు అందిస్తున్నట్టు తేలింది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఈ థెరపీ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఈ థెరపీని ప్రధానంగా స్వల్ప లక్షణాలు కలిగిన (Covid-19 Patients)లలో డయాబెటిస్ వంటి (comorbidities)లకు ఈ థెరపీని వినియోగించేవారు.
Vitamin ’C‘ : విటమిన్ C ఎక్కువగా తీసుకుంటే..పీరియడ్స్ పై ప్రభావం చూపుతుందా..?

ముంబైలోని Wockhardt ఆస్పత్రిలో ఇంటర్నల్ కన్సెల్టెంట్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ బెహ్రామ్ పర్దివాలా ఈ థెరపీతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇంతకీ ఈ థెరపీ ఎలా పనిచేస్తుంది? ఎవరెవరూ ఈ థెరపీ తీసుకోవచ్చు అనేది ఆయన వివరించారు. కరోనా కేసులు తగ్గినప్పటికీ… పాఠశాలలు వాణిజ్య సంస్థలు తెరవడం, లోకల్ రైళ్లు, రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో దేశంలో కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయని పార్డివాలా చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని, మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా బాధితుల కోసం మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ అందుబాటులో ఉందని డాక్టర్ పార్డివాలా చెప్పారు.

‘మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ’ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది?
కోవిడ్ -19 చికిత్సకు USFDA ఆధ్వర్యంలో ఎక్స్‌పోజర్ పోస్ట్ ప్రొఫిలాక్సిస్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీని అందిస్తారు. కరోనాతో అధిక ప్రమాదం ఉన్న బాధితుల్లో తేలికపాటి నుంచి మధ్యస్థ ప్రమాదం ఉన్న బాధితులకు ఈ థెరపీని అందిస్తారు. ఈ థెరపీలో, కాసిరివిమాబ్ (Casirivimab), ఇమ్‌దేవిమాబ్ (Imdevimab) అనే రెండు యాంటీబాడీల కాంబినేషన్‌తో కలిపి అందిస్తారు. దీన్నే కాక్ టెయిల్ అని పిలుస్తారు. తద్వారా బాధిత వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ థెరపీతో హానికరమైన వ్యాధికారకాల నుంచి రక్షణ అందిస్తుంది. ఈ యాంటీబాడీలు మానవ కణాలపై వైరస్ కణాలను చంపేసి ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకుంటాయి.

భారత్ లో 35వేల మందికి కాక్ టెయిల్ థెరపీ :
నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు, ఇండియాలో 35,000 మందికి పైగా కరోనా బాధితులకు ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీని అందించారు. ముంబైలో ఇప్పటి వరకు దాదాపు 1,100 మంది బాధితులకు ఈ చికిత్స అందించారు. కరోనాతో అధిక ప్రమాదం ఉన్నవారికి, పూర్తిగా టీకాలు వేయని లేదా తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన బాధితులకు మాత్రమే ఈ థెరపీని సిఫార్సు చేస్తారు. ఈ థెరపీలోని యాంటీబాడీలతో లక్షణాల తీవ్రత, వ్యవధిని 4 రోజులకు తగ్గిస్తుంది. ఈ థెరపీతో కలిగే ప్రయోజనాల గురించి రియల్ వరల్డ్ స్టడీ EClinical మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ద్వారా తేలికపాటి నుంచి మితమైన COVID-19 యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ చికిత్స ఫలితాలను అంచనా వేసింది. యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ ద్వారా కరోనావైరస్‌‌తో ఆస్పత్రుల్లో చేరే రేటును తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

ఈ ట్రీట్‌మెంట్.. కరోనా బాధితులకు ఎందుకు వరం?:
యాంటీబాడీ కాక్ టెయిల్ స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడాన్ని తగ్గించవచ్చు. అలాగే కరోనా మరణాలను 70శాతం తగ్గిస్తుంది. అంతేకాదు.. తేలికపాటి లక్షణాలతో బాధపడే కరోనా బాధితుల్లో తీవ్రమైన లక్షణాల వ్యవధిని నాలుగు రోజులు తగ్గిస్తుంది. ఈ చికిత్స కరోనా బాధితులను త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. అందుకే కరోనా బాధితుల పాలిట ఈ థెరపీ వరమని చెప్పవచ్చు.
Corona Cases : దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

ఈ చికిత్స ఎవరికి అవసరం :
తేలికపాటి నుంచి మితమైన కరోనాతో బాధపడే 12ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, పిల్లలకు ఈ థెరపీని అందించవచ్చు. తీవ్రమైన కరోనాతో మరణ ముప్పు కలిగిన 60 ఏళ్లు పైబడిన వారు స్థూలకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ థెరపీ, ఎముక మజ్జ లేదా అవయవ మార్పిడి, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ థెరపీని అందించవచ్చు.

ఈ థెరపీని ఎవరికి ఇవ్వరంటే :
కరోనా సోకినప్పటికీ ఈ థెరపీని వారికి అందించవచ్చా లేదా అనేది వైద్యులు నిర్ధారిస్తారు. అది కూడా కరోనా లక్షణాల తీవ్రతను బట్టి బాధితుడికి థెరపీ అవసరమా లేదా అనేది అంచనా వేస్తారు. 12 ఏళ్లలోపు పిల్లలు తీవ్రమైన కరోనాతో ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్ అవసరమైనప్పటికీ ఈ థెరపీని సిఫార్సు చేయకూడదు.

ఈ థెరపీని ఎలా నిర్వహించాలి?
ఈ థెరపీని కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ సోకిన 48గంటల నుంచి 72 గంటలలోపు OPD పద్ధతిలో అందిస్తారు. ఏడు రోజుల ముందు ఇంట్రావీనస్‌ (intravenously) లేదా సబ్‌కటానియస్‌ (subcutaneously) ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
Uttarakhand Rains : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..16మంది మృతి..హైదరాబాదీ యువతులు సేఫ్