Uttarakhand Rains : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..16మంది మృతి..హైదరాబాదీ యువతులు సేఫ్

వ‌రుస‌గా మూడ‌వ రోజు కూడా ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Uttarakhand Rains : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..16మంది మృతి..హైదరాబాదీ యువతులు సేఫ్

Uk (1)

Uttarakhand Rains  వ‌రుస‌గా మూడ‌వ రోజు కూడా ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా…వరద ఉద్ధృతికి ఇండ్లు,బ్రిడ్జ్‌లు కూలిపోయాయి.

వానల ధాటికి ఇప్పటివరకు 16 మంది మృతిచెందార‌ని, రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం మూడు ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌ను రంగంలోకి దింపిన‌ట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి తెలిపారు. మృతిచెందిన 16మందిలో మంగళవారం ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో చంపావత్‌లోని చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఇక, నైనిటాల్ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నైనిటలోని నైనీ సరస్సులో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. స‌ర‌స్సు ఉప్పొంగ‌డంతో రోడ్లు అన్నీ నీట మునిగాయి.

మరోవైపు హల్​ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాఠగోదామ్​ రైల్వే స్టేషన్​ పరిధిలో వరదల ధాటికి 500 మీటర్ల రైల్వేట్రాక్​ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. నై

నిటాల్​ జిల్లాలోని లాల్​కువాన్​ రైల్వే స్టేషన్​ పరిధిలో కూడా పట్టాలపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్త‌రాఖండ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు స‌మీక్షించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై సీఎం పుష్క‌ర్ సింగ్ ధామితో ప్రధాని మోదీ మాట్లాడారు.

ఇక, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన వరదల్లో చిక్కుకున్న సుష్మ అనే మహిళ,ఆమె స్నేహిుతురాళ్లు తమ పరిస్థితి గురించి ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి సహాయ చర్యలకు ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న సుష్మ,ఆమె స్నేహితులను హాయ బృందాలు కాపాడాయి. దీంతో సుష్మ మిత్రబృందం తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

ALSO READ China Lockdown : చైనాలో మళ్లీ కరోనా పంజా.. లాక్‌డౌన్!